కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు
ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో కన్నా, లావు
బీసీ నాయకులకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెంలో మంగళవారం ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలను మోసం చేసిన ఘనత జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.