– టీడీపీ మహిళా నేతల విమర్శ
విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం మహిళ కాదంబరి జత్వానీని నరకం చూపించిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మహిళా నేతలు అన్నాబత్తుని జయలక్ష్మి, మల్లికా, పాకనాటి రమా దేవి ఆరోపించారు. ఈ మేరకు వారు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాదంబరి జత్వానీ మహిళాగా ఎన్నో కష్టాలు పడ్డారు… ఆమెను పోలీసులు, అప్పటి అధికార వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. మహిళలను సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ విచారణ చేయకూడదనే నిబంధన తుంగలో తొక్కి జత్వాని ని తీవ్ర ఇబ్బందులు పెట్టారు… సినీ నటి జత్వాని పోరాటం అలుపెరగనిదిగా ప్రతి మహిళా గుర్తించాలి.
ఐపీఎస్ అధికారులు కష్టపడి చదివి ఇప్పుడు రాజకీయ వత్తిళ్లతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని వారు హితవు పలికారు. ఐపీఎస్ లు రాజకీయాలకు తలొగ్గద్దు, న్యాయం కోసం పనిచేయాలని గుర్తు చేశారు. ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండ్ చేయడం కూటమి ప్రభుత్వ నికి మాత్రమే చేతనవుతుంది. వైసీపీపార్టీని అధికారం ప్రజలు తిరస్కరించినా మహిళా కమిషన్ ఇంకా పదవిని పట్టుకొని వేలాడుతూ ఉండటం చూస్తే సిగ్గనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అరాచక పాలన కొనసాగించడమే పనిగా ఉండటంతో ప్రజల తిరస్కారానికి గురయిందన్నారు.