ఇది మంచి ప్రభుత్వం… మనందరి ప్రభుత్వం

– నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని 6,7,8 వ వార్డుల్లో సోమవారం కూటమి నేతలు,అధికారులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను పంచిపెట్టి గడపగడపకు తిరుగుతూ నాయకులతో కలిసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదన్నారు.

వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలకు, వికలాంగుల పెన్షన్లు 6 వేలకు పెంచి ఘనత చంద్రబాబు దేనన్నారు. వరదల సమయంలో వరద బాధితులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. ప్రజా సంక్షేమానికి చంద్రబాబు పెద్దన్నలా పని చేస్తారన్నారు. సంక్షేమ పథకాల సంస్కరణలు చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం మనందరి ప్రభుత్వమని అధికారులు, నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.