Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో జే గ్యాంగ్‌ భూ దోపిడీ

-పవర్‌ ప్రాజెక్టుల పేరుతో నాలుగు లక్షల ఎకరాలకు టెండర్‌
-షిరిడి సాయి, ఇండో సోలార్‌లకు దోచిపెట్టిన జగన్‌
-మెగా ఇంజనీరింగ్‌, యాక్సిస్‌ ఎనర్జీలకు ధారాదత్తం
-ఫలితంగా ఎన్నికలకు వేల కోట్ల క్విడ్‌ ప్రోకో
-పవర్‌ ప్రాజెక్టుల అగ్రిమెంట్ల రద్దుతో తన సంస్థలకు మేళ్లు
-విశాఖ, ఉత్తరాంధ్రలోనూ పెద్దఎత్తున భూమాఫియాకు తెర
-విశాఖలో నిత్యకృత్యమైన వైకాపా నాయకుల అరాచకాలు
-ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో విచారణ అవసరం ఉంది
-బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌

విశాఖపట్నం: గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భూదోపిడీ రెండు రకాలుగా జరిగిందని బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. విశాఖపట్నంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూదోపిడీలో ప్రాజెక్టు ల పేరుతో దోపిడీ మొదటిదని తెలిపారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతో భూకబ్జాలు, బెదిరించి తక్కువ ధరకు లాగేసుకోవడం, డీ పట్టా భూములు సొంతం చేసుకోవడం, అక్రమ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ల ద్వారా దోపిడీ చేయడం భూదోపిడీలో రెండవ వ్యూహమని చెప్పారు.

పవర్‌ ప్రాజెక్టుల పేరిట భూదోపిడీ
జగన్‌ అస్మదీయులు విండ్‌, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల కోసం దాదాపు నాలుగు లక్షల ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా దోచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌, ఇండో సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు రాష్ట్రంలో భూవనరులను అప్పనంగా జగన్‌ దోచిపెట్టారు. జగన్‌కు విశ్వేశ్వర రెడ్డి మధ్య క్విడ్‌ ప్రో కో నడిచింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వేలాది కోట్ల రూపాయ లు వైకాపా అభ్యర్థులకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌ అధినేత విశ్వేశ్వర రెడ్డి నుంచి అందినట్లు సమాచారం. యాక్సిస్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆగ డాలను ప్రశ్నించిన అనంతరం ఈఆర్సీ 794.90 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. యాక్సిస్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోలార్‌ విండ్‌ హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన షరతులు పూర్తిగా ఉల్లం ఘించి రాయలసీమలో వేలాది ఎకరాల భూములు ధారాదత్తం చేయడానికి ఉపక్ర మించారు. ఇండోసోల్‌ సంస్థ సోలార్‌ ప్యానల్‌ తయారీ సంస్థ కోసమని చెప్పి క్యాప్టివ్‌ పవర్‌ అంటూ 7500 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టులు చూపి లక్షల ఎకరాల భూ దోపిడీ చేశారు.

కంపెనీలతో జే గ్యాంగ్‌ వ్యూహం
ఈ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని పెట్టుబడి సామర్థ్యం లేని ఈ కంపెనీ లకు ఇంత పెద్దఎత్తున ప్రాజెక్టులను కేటాయించడం వెనకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఓయూలు, జీవోలు, భూముల సంతర్పణ ప్రతులు పరిశీ లించి ఆడిట్‌ చేస్తే నిర్ఘాంతపోయే నిజాలు బట్టబయలు అవుతాయి. ఈ సంస్థలకు పెట్టుబడులు మద్యం, శాండ్‌ మాఫియా ద్వారా జే గ్యాంగ్‌ సంపాదించిన వనరు లను వినియోగించారు. ఇంత పెద్దఎత్తున వనరుల దోపిడీతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులను భవిష్యత్తులో అనుమతులతో సహా అంతర్జాతీయ కంపెనీలకు అమ్మివే యడానికి ప్యూహం రచించారన్న అనుమానం కలుగుతోంది. కంపెనీ విలువ మూల్యాంకనానికి అతి ఎక్కువ ధర చూపి చౌకగా లక్షల ఎకరాల భూమి దోచేశా రు. ఆ మొత్తం అధికారికంగా జే గ్యాంగ్‌ దోపిడీకి దారులే. జగన్‌ అస్మదీయులు రాయలసీమ, ఉత్తరాంధ్ర భూముల దోపిడీ కోసం వైకాపా ప్రభుత్వం మొత్తం తలుపులు తెరిచారు. ఎన్నికల ఒక సంవత్సరం ముందు నుంచి ప్రాజెక్టుల పేరుతో జగన్‌ అస్మదీయులకు చేసిన భూ సంతర్పణ, అంతకుముందు ప్రాజెక్టుల అనుమ తుల కోసం చేసిన అకృత్యాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

గ్రీన్‌ కో, మెగా ఇంజనీరింగ్‌కు ప్రాజెక్టులు
కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్‌కు సంబంధిం చిన గ్రీన్‌ కో సంస్థకు అక్రమంగా కర్నూలు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు కేటాయించారు. అలానే జగన్‌ జేబు సంస్థ, అత్యంత విఫలమైన మెగా ఇంజనీర్‌ కు సీలేరు వద్ద పంపు స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ అక్రమంగా కట్టబెట్టారు. పోలవరం, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, వెలిగొండ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైన మెగా ఇంజనీరింగ్‌కు మరలా అనేక ప్రాజెక్టులను అక్రమంగా కట్టబెట్టి న వైనం చూస్తే ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుంది. మెగా ఇంజనీ రింగ్‌ సంస్థ సీఆర్‌డీఏ పరిధిలోని ఎలక్ట్రికల్‌ వర్క్‌లకు సంబంధించిన కేబుల్‌, ఇతర పరికరాలను అక్రమంగా సీఆర్‌డీఏ అనుమతి లేకుండా విశాఖపట్నంకు తరలించి అక్కడి నుంచి వాటిని సప్లై చేసిన కంపెనీలకు తిరిగి వెనక్కి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌ అనే సంస్థ కు గత మూడు సంవత్సరాలలో ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్‌, ఎలక్ట్రికల్‌ మీటర్లు, ఇతర సామగ్రి సరఫరాకు అత్యధిక ధరలు చెల్లించి రాబోయే ఐదు సంవత్సరాలకు సరిప డా మెటీరియల్స్‌ను డంపు చేసి తద్వారా అక్రమ మార్గంలో వచ్చిన నగదును జగన్‌ బినామీ ఖాతాలకు మళ్లించారని అని ఆరోపణలు వస్తున్నాయి. జూన్‌ 4 తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్‌, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌, ఇండోసోల్‌, యాక్సిస్‌ ఎనర్జీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మొదలగు సంస్థలు చేసిన అక్రమా లపై వెంటనే ఒక ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించి జరిగిన అవినీతి అక్రమాల నిజాలు నిగ్గులను తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

అగ్రిమెంట్ల రద్దుత జగన్‌ సంస్థలకు మేళ్లు
వైకాపా ప్రభుత్వం పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు రద్దు చేసిన అనంతరం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఫిక్స్‌డ్‌ చార్జీల కింద సంబంధిత కంపెనీలకు చెల్లించమని ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఆ మొత్తంలో రూ.1600 కోట్ల వరకు అవినీతి చేసి ఆ నిధులు ఆ కంపెనీలకు విడు దల చేయడం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిలో జగన్‌ సంస్థలకు అత్యధిక మేలు జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాబోయే ప్రభుత్వం పవర్‌ ప్రాజె క్టులు, వాటికి చేసిన భూముల కేటాయింపుపైన లాలూచీపడి అవినీతి చేసిన వ్యక్తు లు, సంస్థలు, అధి కారులపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వైజాగ్‌, ఉత్తరాంధ్రలో భూమాఫియా
అధికార పార్టీ స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నామినేటేడ్‌ పదవు లున్న వారు కొంతమంది అధికారులు, గుండాలతో కుమ్మక్కై వైజాగ్‌లో భూ మాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. కడప నుంచి విశాఖపట్టణంకు భూమాఫియా కబ్జాల కోసమే విమాన సర్వీసులు నడిపారనే ఆరోపణలున్నాయి. రుషికొండను బోడి గుండు చేసిన ఉదంతం నుంచి సముద్ర తీరప్రాంతం భూములు, చాలా ఖరీదైన వాణిజ్య, వ్యాపార కట్టడాలను బెదిరించి చౌకగా వైకాపా నాయకులు కొట్టేశారని విశాఖ ప్రజలు చెబుతున్నారు. విశాఖ చుట్టూ చిన్న, మధ్యతరగతి కుటుంబాల భూములు కబ్జా చేయడం లేదా నామమాత్రపు ధరలకు బలవంతంగా వైకాపా నాయకులు లాగేసుకున్నారని స్థాని కులు చెబుతున్నారు. దసపల్లా భూములు 17 శాతం భూమి యజమానులకు ఇచ్చి మిగిలిన 83 శాతం బలవంతంగా స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధి దోచుకున్నారు. భూమి అభివృద్ధి అగ్రిమెంట్లలో భూయజమాని వాటా 40 శాతం నుంచి 60 శాతం మధ్య ఉంటుంది. కానీ, బలవంతంగా వాటిని లాక్కున్నారు.

భూ అనుసంధానం వెబ్‌సైట్లపైనా అనుమానం
వందల కోట్ల విలువైన మాన్సాస్‌ ట్రస్ట్‌ భూములను దోచేయడానికి రాష్ట్ర మంత్రు లు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. విశాఖపట్టణంలో రాష్ట్ర సీఎస్‌ తనయు డిపై 800 ఎకరాల అసైన్డ్‌, డీ పట్టా భూముల స్కాం ఆరోపణలు రావడం దౌర్భాగ్యం. గడచిన కొన్నినెలలుగా భూములకు అనుసంధానం అయిన వెబ్‌సైట్లు పనిచేస్తున్న విధానం వెనుక భారీ భూదోపిడీ ఉందని ఇట్టే అర్థం అవుతుంది. కరోనా సమయంలో కడప నుంచి తెప్పించిన మాఫియాతో స్థానిక వైజాగ్‌లో ఒక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వారి భూమిని లాగేసుకోవడానికి బెదిరించారు. ఆ వ్యక్తి సుప్రీంకోర్టు దాకా వెళ్లవలసిన దుస్థితి. ఎంతమంది ప్రజలు ఇంత పోరాటం చేయగలరు.

భూ మాఫియాపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ విశాఖలో ఎందుకు పర్యటించారు అంటే సరైన సమాధానం వారి నుంచి రావడం లేదు. ప్రజలు మాత్రం వేలాది డీ పట్టా భూముల దందా కోసం అంటున్నారు. ప్రభుత్వ, అటవీ భూములు దాటుకు ని డీ పట్టా భూములు, ప్రైవేట్‌ భూములు కబ్జాలకు గురి కావడం లేదా బెదిరించి నామమాత్రపు ధరకు లాక్కోవడం విశాఖలో వైకాపా నాయకులకు నిత్యకృత్యం అయిందని అర్థం అవుతుంది. సింహాచలం దేవాలయం భూములు చాలావరకు వైకాపా నాయకులకు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇలా అక్ర మంగా భూదోపిడీ చేసి సంపాదించిన సొమ్ముతో వైకాపా నాయకులు వందలాది కోట్లు ఎన్నికలలో ఖర్చు పెట్టారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చూపించి దోచిన భూములతో ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌కు వైకాపా ప్రజాప్రతినిధులు పాల్పడ్డారు. ఇప్పుడు సీఎస్‌ వంటి అధికారుల తనయుల పేరు పొక్కడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్రంలో పవర్‌ ప్రాజెక్టుల పేరుతో భూదోపిడీ, విశాఖ, ఉత్తరాంధ్రలో విచ్చలవిడి భూమాఫియా ఆగడాలపై రాబోయే నూతన ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫో ర్స్‌ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ భూమాఫియా బాధితులకు బీజేపీ అండగా ఉండి న్యాయం కోసం పోరాడుతుంది.