-జగన్ కాదు.. జలగ
-ఏ విధంగా మీది రైతు ప్రభుత్వం ?
-రైతుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు ?
-రాష్ట్రప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పురందేశ్వరి
-రైతులు తీవ్రవాదులా… పాకిస్థానీలా ?
-వారి ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వరా ?
-దాచుకోవడం..దాచుకోవడం జగన్ టార్గెట్
-రైతుల ఆత్మహత్య ల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ సిగ్గు పడాలి
– బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్
-వైసీపీ పై గర్జించిన రైతులు
-జగన్ వల్ల రైతు మృత్యుఘోష అంటూ నాటిక ప్రదర్శన
విజయవాడ.. నాలుగు న్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు వంక కన్నెత్తి కూడా చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.
విజయవాడ లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగిస్తూ..
ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. తొంభై శాతానికి పైగా రైతులు అప్పుల్లో కూరుకు పోయారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. రైతు పక్షపాతి ప్రభుత్వం అనేది జగన్ మాటలకే పరిమితం చేతల్లో సున్నా అంటూ ఆక్షేపించారు. రైతులను ఆదుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యారు. వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమ లో ఉత్పాదన తగ్గిపోయింది. ఏ విధంగా మీది రైతు ప్రభుత్వం అవుతుందో చెప్పాలి.
బైబిల్, ఖురాన్, భగవద్గీత.. మా మ్యానిఫెస్టో అని గొప్పగా చెప్పారు.ఆ హామీలు అమలు చేయకుండా ఆ పవిత్ర గ్రంధాలని అవమానించారు .మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ కోసం అన్నారు.నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు కోసం నిధి అన్నారు.మరి ఈ నిధి లు ఎక్కడకు వెళ్లాయో జగన్ సమాధానం చెప్పాలి.తుఫాన్ లతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదు.
పంట పరిశీలన కు వచ్చి ఫ్యాంట్లు పాడైపోతాయని పొలాల్లోకి కూడా దిగలేదు. అధికారంలో లేనప్పుడు రెండేళ్ల పాటు ఓదార్పు యాత్ర చేశారు. మరి ఇప్పుడు అదే రైతుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు. మద్దతు ధర కోరితే కనీసం స్పందన లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోయి నష్టపోయిన వారిని ఆదుకో లేదు.ఉపాధి హామీ కింద కేంద్రం నిధులు ఇస్తే… వాటిని మళ్లించారు.రైతుల కన్నీరు తుడవాలనే ఆలోచన జగన్ కి లేదు.
ఆహార భద్రత ను అందించిన మహాను భావుడు స్వామినాధన్. అటువంటి వారిని గుర్తించి మోడీ భారతరత్న కు సిఫార్సు చేశారు. కనీస మద్దతు ధర మోడీ ప్రభుత్వం 200 శాతం వరికి పెంచింది. దేశంలో ఎక్కడైనా రైతుకు అమ్మకునే అవకాశం మోడీ కల్పించారు.
రైతు కుటుంబానికి సాలీనా యాభైవేలు వచ్చే అవకాశం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కల్పించారు. రైతు లకు ఇచ్చే సబ్సిడీ భారం మొత్తం కేంద్రం భరిస్తుంది. రైతుకంతా ఒక్కసారి ఆలోచన చేయండి.. మీకు మేలు చేసే వారికి పట్టం కట్టండి.
మరో అతిథి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ..
బిజెపి రైతు గర్జన చూసి ప్రభుత్వం భయ పడుతుంది మా సభకు రాకుండా వివిధ ప్రాంతాల్లో రైతుల ను అడ్డుకోవడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఎబివిపి నేతలను కూడా అరెస్టు చేయడం ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. నేడు జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిస్తూ నయ వంచనకు పాల్పడ్డారు
దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యం గా జగన్ పాలన సాగుతుంది. జగన్ అవినీతి తెలుసుకుని వైసిపి నాయకులే ఆశ్చర్య పోతున్నారు. రైతన్నలకు మోడీ అన్నగా ఉంటే… జగన్ మాత్రం వారి ఆత్మహత్య లకు కారణం అయ్యారు. మోడీ నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు.ఎపిలో మాత్రం డబ్బులు ఇస్తామని రైతులకు మొండిచేయి చూపారు. జగన్ బటన్ నొక్కి… మాయలు చేసేవాడు. డబ్బులు నిజంగా పడినట్లు అధికారులు ఇంకా నటించే వారు. ఈ మోసం గుర్తించే కేంద్రం ముందుగానే రైతు ఖాతాల్లో డబ్బు వేసింది. అయినా మళ్లీ అదే డ్రామాను జగన్ అండ్ కో రక్తి కట్టించారు. డబ్బులు వేయకుండా వేసినట్లు జగన్ మాయ, మోసం చేశారు
మోడీ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటే… అది జగన్ చేసినట్లు సొంత మీడియా లో ప్రచార ఆర్భాటం చేసేవారు. రైతులు తీవ్రవాదులా… పాకిస్థానీలా ? వారి ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.లక్షా 56 వేల కోట్లు మోడీ రైతులకు భీమా కింద కట్టారు.ఇప్పటికీ రాష్ట్ర వాటాగా జగన్ రైతు లకు భీమా సొమ్ము కట్ట లేదు.పంట పెట్టుబడి రాయతీ అని ఇటీవలే జగన్ మరోసారి మోసం చేశారు.యాంత్రీకరణ కింద కేంద్రం యాభై శాతం సబ్సిడీ ఇస్తే.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరికరాలను కొనుగోలు చేయకుండా రైతులను వంచించారు.పిఎం కిసాన్ నిధి ద్వారా కేంద్రం 14 వేలకోట్లు నేరుగా ఖాతాల్లోకి వేశాం.జలకళ పేరుతో హడావుడి చేసి … జగన్ వెలవెల బోయేలా చేశారు.
పంట నష్టం పరిశీలనకు కూడా పొలంలో కాలు పెట్టకుండా చూడటం జగన్ కే చెల్లింది
ఐదు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ కావాలంట. రైతుల ఆత్మహత్య ల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ సిగ్గు పడాలి.ఆత్మహత్యల్లో వృద్ది రేటు 19 శాతం పెరిగింది. మరి పరిశ్రమలు, ఉపాధి లో వృద్ధి లేదే… జగన్ సమాధానం చెప్పాలి.రైతులను ముందు ఆదుకోరు.. తరువాత ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయం చేస్తారు.మోడీ మాత్రం ఏపీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో రైతుల దుస్థితిని వివరిస్తూ ప్రదర్శించిన నాటకం కన్నీరు తెప్పించింది.గతంలొ రైతు అంటే అభిమానం ఉండేది.. ఇప్పుడు సానుభూతీ చూపే పరిస్థితి.ఎపిలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారి గురించి ఆలోచన చేయడం లేదు. పోలవరం విషయంలో అసలు పట్టించుకోవడం లేదు.మీ రాజకీయాలకు పోలవరం బలి చేయడం దారుణం. .రైతుల కోసం మోడీ అనేక పధకాలు అమలు చేశారు.రాష్ట్రం లో ఇందుకు భిన్నంగా పాలన సాగుతుంది.ఏపీ లో జె ట్యాక్స్ ఒకటి పెట్టి అందరూ దోచుకుంటున్నారు.ఇటువంటి దుర్మార్గపు పాలన ను సాగనంపాలని కోరుతున్నాను.
సభకు అధ్యక్షత వహించిన చిగురుపాటి కుమార స్వామి మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రుల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన.రైతు వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులంతా నడుం కట్టాలని పిలుపు . రాష్ట్రం లో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. కేంద్రం రైతాంగం కోసం ఇచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది.అన్నదాతల ఆవేదనను జగన్ అసలు పట్టించుకోలేదు.రైతు సమస్యలు పై బిజెపి అనేక పోరాటాలు చేసింది. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు రైతులు అందరూ సంఘటితంగా ఉండాలన్నారు. రైతులను సభకు రానివ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం పై తాడోపేడో తేల్చుకుందామన్నారు.
బిజెపి మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాతలకు అన్నపూర్ణ గా ఆంధ్రప్రదేశ్ కు పేరు ఉండేది. అజ్ఞాని జగన్ సిఎం కావడమే ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఎపిలో వ్యవసాయం గిట్టుబాటు లేకుండా చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోవడం వల్ల రైతు నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ నిర్లక్ష్యం వల్ల రెండు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య లు చేసుకున్నారు.
ఈ ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వం దోరణితో పాలన చేస్తుంది. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు లు, కేసులా.అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోవడం జగన్ చేతకాని పాలనకు నిదర్శనం. ఈ సీఎం ను గద్దె దించే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాలి.
సభలో కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు పెన్మత్స రవిరాజు, తోట గంగరాజు, నల్లా పవన్, సురేంద్రనాధ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మువ్వ వెంకట సుబ్బయ్య, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, ఏలూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తదితరులు వేదికను అలంకరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కి నాగలి బహూకరించి కిసాన్ మోర్చా సత్కరించారు.
నాటిక
నకిలీ విత్తనాలు వల్ల ఎంత నష్టం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహకరించక పోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటూ నాటిక ప్రదర్శించడం తో రాష్ట్రప్రభుత్వ దుర్నీతిని నాటిక ద్వారా ప్రదర్శించారు.