సీమలో సభ పెట్టిన జగన్ ఇరిగేషన్ గురించి నోరెత్తలేదు

– సీమ రాత మార్చేది నీళ్లు..పెట్టుబడులు..విద్య..ఉద్యోగాలేనని భావించి నాడు పనులు చేశాం
– ప్రజల ఇళ్లలో సంపద సృష్టి నా లక్ష్యం…తన ఇంట్లో సంపద సృష్టి జగన్ ఆశయం
– స్కాం పైనే స్కాంకు పక్కా ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్
– రూ.10 వేల కోట్ల విలువ చేసే భూముల్ని రూ.500 కోట్లకే దోచే యత్నం
-వివేకా హత్యపై నేను చర్చకు సిద్ధం…జగన్ సిద్ధమా.?
-ప్రతిపక్ష నేతగా కోర్టుకు వెళ్లి వివేకా హత్యపై గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరు..సీబీఐపై కేసులు పెట్టిందెవరు?
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-వివేకా హత్యపై సాక్షి పత్రికను సభలో చూపించి మరీ చర్చకు సై అంటూ చంద్రబాబు సవాల్

పెనుకొండ : రాయలసీమలో సిద్ధం సభ పెట్టిన జగన్ ఇరిగేషన్ సీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎందుకు నోరెత్తలేదు? సీమ రాతను మార్చేది నీళ్లు..పెట్టుబడులు..విద్య..ఉద్యోగాలే అని భావించి తాను పని చేశానని గుర్తు చేశా. స్కాం పైనే స్కాంకు పక్కా ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్. రూ.10 వేల కోట్ల విలువ చేసే భూముల్ని 500 వందల కోట్లకే దోచేసేందుకు ప్రయత్నించాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

శ్రీసత్యజిల్లా, పెనుగొండ నియోజకవర్గంలో కియా కార్ల పరిశ్రమ సమీపంలో ఏర్పాటు చేసిన రా…కదలిరా సభలో ప్రసంగించారు. ‘ఓ వైపు ముండుటెండ…మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా వాసుల్లో కసి. రాబోయే ఎన్నికల్లో సైకో రెడ్డితో తాడో పేడో తేల్చుకుందామనే పౌరుషం మీలో కనపడుతోంది. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ప్రతిఒక్కరూ జెండా పట్టుకోవాలి. స్వార్థం కోసమో..అధికారం కోసమో కాదు…రాష్ట్రాన్ని కాపాడేందుకు మనం కొదమసింహాల్లా ముందుకు రావాలి.

40 ఏళ్లుగా సభలు, సమావేశాలు ఎన్నో నిర్వహిస్తున్నాను కానీ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది.

సీమకు నీళ్లిస్తే సిరులు పండుతాయి
బాదుడు లేని సంక్షేమం , కోతలు లేని సంక్షేమం కోసం, మహిళా రక్షణ కోసం రా కదిలిరా అని పిలుపునిచ్చాను. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తూగా ఓడించిండి. నాకు ఉమ్మడి అనంతపురం అత్యంత ఇష్టమైన జిల్లా.

భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఇది. 47 లక్షల ఎకరాల భూమి ఈ జిల్లాలో ఉన్నా….సాగు అయ్యేది అతి తక్కువ. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించే జిల్లా చేయాలని కంకణం కట్టుకున్నా. నేను రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు పూర్తిచేశాను. నీరు ఇస్తేనే సీమ సిరులు కురుస్తుందని నేను ఎంతో తపించా.

జీడిపల్లి, భైరవాని తిప్ప, వెల్లపల్లి, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకశిర బ్రాంచ్ కెనాల్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేశాను రాయలసీమతో పోటీపడే ప్రాంతం దేశంలోనే ఎక్కడా లేదు. నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కియా మోటార్స్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం. కియా రాకముందు ఈ ప్రాంతంలో ఎకరా రూ.2 లక్షలు…ఇప్పుడు రూ.2 కోట్లు. మనం అధికారంలో కొనసాగి ఉంటే రూ.3 కోట్లయ్యేది. కియా తెచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చాం.

ఇక్కడ తయారు చేసిన 12 లక్షల కార్లు దేశవిదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే టీడీపీ మార్క్. టీడీపీ మరో ఐదేళ్లు ఉండుంటే ఈ ప్రాంతమంతా పరిశ్రమలు వచ్చేవి.

స్కాంపైనే స్కాంకు మంచి ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్
జిల్లాలో ఎవరిది అభివృద్ధో ఎవరిది దోపడీనో ప్రజలు ఆలోచన చేయాలి. వైఎస్సార్ సైన్స్ సిటీ, నాలెడ్జ్ హబ్ అని రైతుల భూములు కొట్టేశారు. స్కాముల కోసమే స్కీములు రూపొందించారు. జగన్ రెడ్డి నాలెడ్జ్ హబ్ పేరుతో భారీ భూ దోపిడీ చేశాడు. 4,500 ఎకరాల విలువ రూ.10 వేల కోట్లుంటుంది. దాన్ని రూ.500 కోట్లకు కొట్టేసేందుకు జగన్ రెడ్డి టెండర్ పెట్టాడు. అదిప్రజల సొత్తనుకున్నావా…మీ అబ్బ సొత్తనుకున్నావా?

మనకు ఏం తెలీదని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు. నేను పేదల ఇళ్లలో సంపద సృష్టిస్తే జగన్ రెడ్డి పేదలను దోచుకుని వారి పొట్ట కొట్టాడు. టీడీపీ హయాంలో జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చాం. సెంట్రల్ వర్సిటీ, ఏషియన్ పెయింట్స్ తెచ్చాం. ఇక్కడ అడుగడుగునా విండ్ మిల్ , సోలార్ ఉత్పత్తి ఉంది. ఇక్కడ సోలార్ పండిస్తే దేశానికే కరెంటు ఉత్పత్తి చేసే సత్తా మన అనంతపురానికే దక్కుతుంది.

అధికారంలోకి వస్తే ఉచితంగా సోలార్ పంపుసెట్లు. గోదావరి నీళ్లు సీమకు తీసుకొస్తే సీమ రతనాల సీమ అవుతుందా లేదా? మిమ్మల్ని ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారుచేస్తే ప్రపంచాన్ని జయించగలరు. అందుకే నేను చదువు, నీటికి ప్రాధాన్యమిచ్చా. భావితరాలు బాగుండాలనే నేను ఆలోచిస్తా. నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఎలా ఉందో చూశారుగా. ఐటీతో యువతకు ఉపాధి కల్పించా.

అదే మాదిరిగా ఏపీని బాగుచేయాలని తపించా. మనకున్న అన్ని వనరులు వినియోగించుకుని ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేయాలని భావించాను. దేశంలో ఎక్కడాలేని సముద్రతీరం ఉంది. 16 లక్షల పెట్టుబడులు తెచ్చాం. అమరావతి ప్రారంభించాం. కానీ జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు.

సీమ ద్రోహి జగన్ రెడ్డి
ఇటీవల జగన్ రెడ్డి ఇక్కడ సిద్ధం సభ పెట్టాడు. వేలాది ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు. కానీ మనకు మాత్రం ఇవ్వలేదు. సైకో రూల్ మనం పాటించాలా? మన సభలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడంట. వీళ్ల తాత జాగీరా రాష్ట్రం. సైకో అడ్డుకున్నా మా తమ్ముళ్లు ఆగరు. సభకు రావాలంటే మన తమ్ముళ్లకు మోటర్ బైకులు ఉన్నాయి. వేల బైకులు…లక్షలజనం. ఎవరైనా అడ్డొస్తే తొక్కించుకుంటా రండి..నేనున్నా…మీకు నేనున్నా అండగా. వస్తారా రాష్ట్రం కోసం.

సిద్ధం సభలో జగన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు ఓడిపోవడడానికి సిద్ధం. తెలుగుదేశం-జనసేన గెలవడానికి సిద్ధం. గెలిచేది తెలుగుదేశం-జనసేన…ఓడిపోయేది వైసీపీ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం పేరుతో ఊరూరా కటౌట్లు పెట్టాడు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. పెన్షన్ ఇస్తున్నానని గొప్పలు చెబుతున్నాడు. అసలు పెన్షన్ ప్రారంభించిందే ఎన్టీఆర్.

రూ.200 పింఛను రూ. 2000 చేసింది నేను. నేను మళ్లీ వచ్చుంటే తొలి నెలలోనే రూ.3 వేలు చేసే వాన్ని. మేము వచ్చాక ఇంటింటికీ వెళ్లి పింఛను ఇస్తాం. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే….జగన్ రెడ్డి పాలనలో మటన్ కొట్టులో, ఫిష్ మార్కెట్ లో, మద్యం షాపులో ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తా. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మీ ఇంటి దగ్గరే కూర్చుని వర్క్ చేసుకునేలా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాను.

ఏపీ యువతను ప్రపంచంతో అనుసంధానం చేసి బంగారు భవిష్యత్ మీకిస్తా. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. కానీ మీరు వైసీపీకి పనిచేయొద్దు. సైకో పోతే తప్పించి మనకు భవిష్యత్ లేదు. 40 రోజులు సైకిల్ ఎక్కండి. గ్లాసు పట్టుకోండి. నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం, అన్నా క్యాంటీన్లు మూసేయడం, ధరలు పెంచి పేదల నడ్డి విరచడం, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం , లిఫ్ట్ ఇరిగేషన్ ధ్వంసం చేయడం జగన్ రెడ్డి మార్కు.

ఒక చేత్తో 10 రూపాయిలిచ్చి మరో చేత్తో రూ.100 దోచేసే దొంగ జగన్ రెడ్డి. 25 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసిన పార్టీ తెలుగుదేశం. 12 లక్షల ఇళ్ల నిర్మాణం , చంద్రన్న బీమా, విదేశీ విద్య, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది తెలుగు దేశమే. టీడీపీకి-వైసీపీకి నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.

వివేకా హత్యపై నేను చర్చకు సిద్ధం…జగన్ సిద్ధమా.?
బాబాయ్ హత్య, రక్త చరిత్ర జగన్ రెడ్డి మార్కు. సొంత చెల్లి పుట్టుకపై నీచపు ప్రచారం చేయడం నీ మార్కు. అమ్మను గెంటేయడం నీ మార్కు. తల్లికి తిండి పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొంటాడా? హు కిల్డ్ బాబాయ్.? వివేకాకు గుండెపోటు అని పనికిమాలిన సాక్షిలో రాశాను. గొడ్డలి ఎవరిచ్చారని నీ చెల్లెలు అడుగుతోంది. సమాధానం చెప్పుడు జగన్ రెడ్డీ? జగనాసుర రక్త చరిత్ర ఎవరిదో తేల్చుకుందాం. నీకు ధైర్యం ఉంటే రా పెనుకొండ…ఎవరు వివేకాను చంపారో చర్చకు రా….

హత్యలు చేసే వాళ్లు ముఖ్యమంత్రిగా అర్హులా? మీ ప్రాణానికి రక్షణ ఉందా? ఆడబిడ్డలకు రక్షణ ఉందా? మా కార్యకర్తల జోలికొస్తే ఖబద్ధార్….దెబ్బకు దెబ్బ తీస్తాం. తమాషా అనుకోవద్దు. నేను అనంతపురం జిల్లాలో నీళ్లు పారిస్తే సైకో రెడ్డి రక్తం పారించాడు. మీ కోసం ఎలాంటి త్యాగాలకైనా నేనూ, పవన్ కల్యాణ్ సిద్ధం. సంపద సృష్టించడం, పేదరిక నిర్మూలన చేసే పార్టీ తెలుగుదేశం. ఎమ్మెల్యేలను ప్రాంతాలు మార్చినంత మాత్రాన ..అక్కడ చెత్త ఇక్కడ వేసినంత మాత్రాన గెలవలేరు.

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం
పెనుకొండ శంకర్ నారాయణ ఎంత అవినీతిపరుడో మీకు తెలుసుగా? ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై వైసీపీ గూండాలు దాడి చేశారు. అన్నీ లెక్కపెట్టుకున్నా …ప్రతిదీ చెల్లిస్తా. రాప్తాడులో తోపుదుర్తి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. లేఅవుటు వేయాలన్నా కప్పం కట్టాల్సిందే. రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించాడు. నీకు అకౌంట్లన్నీ సెటిల్ చేస్తాను తోపూ …రెడీగా ఉండు. జాకీ పరిశ్రమను వెళ్లగొట్టి 6 వేల ఉద్యోగాలు రాకుండా చేశారు.

ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ పబ్లిసిటీ చేస్తాడు. కదిరి సిద్దారెడ్డి …లక్ష్మీ నరసింహుని కూడా వదల్లేదు. ముడుపులు ఇస్తే కానీ వైసీపీ పాలనలో పనులు కావు. నేను అధికారంలోకి వచ్చాక కియా అనుబంధ సంస్థలు వచ్చేలా ప్రయత్నిస్తా. బెంగుళూరు వరకూ ఇండస్ట్రియల్ కారిడార్ కు కృషి చేస్తా. సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తాము. గోరంట్లకు కూడా నీరిచ్చే బాధ్యత తీసుకుంటాం.

మడకశిరలో వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తయారుచేస్తాం. జిల్లాలో 14కి 14 సీట్లు గెలిపిస్తామని హామీ ఇవ్వండి. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. పార్టీలో అందరికీ మంచి భవిష్యత్ ఉంటుంది. టీడీపీ, జనసేన పాలు నీళ్లులా కలసిపోవాలి. ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్రం కోసం పనిచేయండి. మేము మీకు అండగా ఉంటాము. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.