వైసీపీ అధినేతకు కాల్స్ అతిపెద్ద మిస్టరీ
ట్రాన్స్‌పరేన్సీకి పెట్టింది పేరు లోకేష్
లక్షల మందికి ఫోన్ నెంబర్
అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి తనకు ఫోన్ లేదు.. నెంబరూ లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఫోన్ లేని వాడికి బాబాయ్ మర్డర్ కాల్ వేకువనే ఎలా వచ్చిందో సీబీఐ దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. నెంబర్ లేని జగన్…సీఎంగా ఉన్నప్పుడు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో తనకు ఫోన్ చేయాలని పిలుపునిచ్చాడు. ఫోన్ లేని జగన్‌కు, నెంబరే లేని జగన్‌కు ఫోన్లు ఎలా వెళతాయో, ఆయన ఫోన్లు ఎలా తీసుకుంటున్నాడో అతిపెద్ద మిస్టరీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్రాన్స్‌పరెన్సీ పాలిటిక్స్‌కు పెట్టింది పేరు. ఏ సభకు వెళ్లినా, ఏ సమావేశా నికి హాజరైనా బహిరంగంగా తన ఫోన్ నెంబర్ చెబుతాడు. అత్యవసరం అయితే మెసేజ్ చేయండి.. గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్లు పెట్టొద్దు…అటువంటి మెసేజ్‌లు పెడితే ముఖ్యమైన సాయం అందాల్సిన సమాచారం మిస్ అవుతుందని రిక్వెస్ట్ చేసి చెబుతారు. లోకేష్ ఫోన్ నెంబర్ ఏపీలో లక్షల మంది దగ్గర ఉంది.