– జగన్ కు కఠిన శిక్ష పడాల్సిందే
– బీసీ శాఖ మంత్రి సవిత
పెనుకొండ : జగన్మోహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావులు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డికి భూ కబ్జాలు, అక్రమ ఇసుక, మైనింగ్ తో ఇష్టారాజ్యంగా దోచుకున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. ఇవీ చాలవన్నట్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో కూడా కక్కర్తిపడ్డారన్నారు.
వెంకన్న లడ్డూలో జంతవుల కొవ్వు పదార్థాలు కలిపి, హిందువుల మనస్సులను గాయపరచాడన్నారు. జగన్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని, కొవ్వుకొట్టుకుపోతాడని, ఆయనకు కఠినంగా శిక్షించాలని మంత్రి సవితి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకుల, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.