– తెదేపా జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్
నరసరావుపేట, మహానాడు : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
దేవాలయంలాంటి అసెంబ్లీలో బూతుల మంత్రులతో గౌరవసభను కౌరవసభగా మార్చి, సభ్య సమాజం తలదించుకునేలా అసెంబ్లీని మార్చిన జగన్, రాజ్యాంగం, విలువలు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. సభా సాంప్రదాయాలు తెలియని జగన్… సభలో ఎలా ప్రవర్తించాలో ముందు అది నేర్చుకుని తరువాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు.
నిన్నటి వరకు పోలీసు వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని, ఆనాటి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం కేసులు పెట్టి జైలుకు పంపించిన జగన్… ఈ రోజు అదే పోలీసులకు నీతులు చెప్పడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక ఐఏఎస్ అధికారిని మోకాలు పై కూర్చోబెట్టిన, ఈ రోజు పోలీసులకు మూడు సింహాల గురించి చెప్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటుందన్నారు.
అసెంబ్లీని బాయ్ కట్ చేయడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి వినుకొండ విషయాన్ని తెరపై తీసుకొచ్చి ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నావు, చంద్రయ్య పీక కోసిన రోజు, డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా ముద్ర వేసి నడిరోడ్డుపై బట్టలిప్పిన రోజు, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ శవాన్ని మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన రోజు, అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజు ప్రజాస్వామ్య విలువలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు
ప్రజాస్వామ్య విలువలు గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ ఈ రాష్ట్ర ప్రజలకు పట్టలేదని, ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.