సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: ప్రజలను ధనాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్ అని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సత్తెనపల్లి రూరల్ మండలం కందులవారిపాలెం, గోగులపాడు గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు అధికార పంట అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతుంటే యువత భవిష్యత్ ఏమైపోతుందని ఆలోచన కూడా లేదు. మద్యనిషేధాన్ని గాలికి వదిలేసి లక్షలాదిమంది మహిళలు నమ్మకాన్ని వమ్ము చేశాడు. నమ్మకద్రోహానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడని విమర్శించారు. ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలా…సంక్షోభంతో కూడిన ప్రభుత్వం కావాలో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.