● రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
●జగన్ కి సీఎం పదవి పొయ్యాక పిచ్చెక్కి మాట్లాడుతున్నారు..
●గత ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు11 సీట్లు ఇచ్చినా జగన్ లో మార్పు రాలేదు.
● ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు
●ప్రతి టిడిపి కార్యకర్త సభ్యత్వం తీసుకోవాలి
● ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని
ఒంగోలు : ప్రభుత్వ అధికారులపై వైసీపీ అధినేత మాట్లాడిన మాటలు సరికాదని, జగన్ నోరు అదుపులో పెట్టుకోనీ మాట్లాడాలని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ హెచ్చరించారు.
ఒంగోలు భాగ్యనగర్ లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ
నిన్న జగన్ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అధికారులను ఎదో చేస్తామని బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అనేది ఓ కలగానే మిగులుతుందని నూకసాని తేల్చిచెప్పారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలో వైసీపీ 11 సీట్లకే పరిమిత్తం చేసిన జగన్ సిగ్గు రాలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు సొంత తల్లి, చెల్లినీ అసభ్యంగా వేదిస్తే జగన్ పైశాచిక ఆనందం పొందారని, సామాజిక మాధ్యమాల్లో ఆడవారి పట్ల పోస్ట్లు పెట్టే వారికి మద్దతు ప్రకటించే నీచమైన వ్యక్తి జగన్ అని నూకసాని విమర్శించారు. సీఎం చంద్రబాబు కన్నెర్ర చేస్తే జగన్ రాష్ట్రంలో తిరగలేడని నూకసాని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ఎటువంటి అవినీతి పాల్పడకపోయిన కావాలానే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి సీఎం చంద్రబాబునీ అరెస్ట్ చేసిన వ్యక్తి జగన్ అని ఇప్పుడు ప్రభుత్వం సరైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా, జుగుప్సాకరమైన రీతిలో పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేస్తున్నామని అన్నారు. అటువంటి వారికి అండగా ఉంటామని జగన్ చెప్పడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని నూకసాని విమర్శించారు.
గత ప్రభుత్వం ప్రతి శాఖలో అవినీతి, అక్రమాలకి వైసీపీ నేతలు పాల్పడ్డారని త్వరలో వాటి అన్నిటిని బయట పెట్టి వైసీపీ నేతలను జైలుకి పంపటం కాయం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు కష్టపడుతుంటే జగన్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా జైలుకి పంపటం కాయమని నూకసాని హెచ్చరించారు. జగన్ సీఎం పదవి పొయ్యాక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభత్వం పాలన మారినా కొంతమంది అధికారులు గత ప్రభుత్వం వాసనను వదల్లేదని తీరు మార్చుకోవాలని నూకసాని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తేలేదని నూకసాని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రతి కూటమి కార్యకర్తకి అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి టీడీపీ కార్యకర్త టీడీపీ సభత్వం తీసుకోవాలన్నారు. ప్రమాద సమయంలో సభ్యత్వం కార్యకర్తకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా నూకసాని బాలాజీ అన్నారు