-రేపు ఉదయం రాష్ట్రానికి రాక
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శుక్రవారం రాత్రి ఆయన లండన్ నుంచి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళతారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.