-రూ.750 కోట్లు దేనికి మళ్లించారో చెప్పాలి
-స్టేట్ ఫైనాన్స్‌లో రూ.4,736 కోట్ల గోల్‌మాల్
-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: డ్వాక్రా మహిళల డబ్బులు ఎగ్గొట్టి జగన్ ప్రభుత్వం వారిని మోసగించిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభు త్వం చెప్పాలని నిలదీశారు. చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి కూడా వందల కోట్లు దోచేశారని తెలిపారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా రూ.4,736 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. రెండున్నరేళ్ల క్రితమే కాలపరిమితి ముగిసిన డిపాజిట్లు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ి33 ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల నిధులు స్వాహా అయ్యాయని, జూన్ 4 ఫలితాల లోపు ప్రతి పైసాకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా అక్కచెల్లెళ్లమ్మల తక్షణం స్త్రీనిధి ఖాతాకు డబ్బు జమ చేయాలని, విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి మళ్లించిన నగదు వెంటనే తిరిగి ఇవ్వాలని కోరారు.