వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వని వైఎస్. జగన్మోహన్ రెడ్డి

– బాధితులకు కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
– 9వ డివిజన్లో దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో అనేక సార్లు తుఫానులు, వరదలు వచ్చాయని ఆ సమయంలో బాధితులను అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి కూడా పరామర్శించకపోగా, ఒక్క రూపాయి కూడా పరిహారంగా ఇవ్వలేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు బాధితులకు అండగా ఉండటమే కాకుండా రూ.20 వేలు నష్ట పరిహారంగా బాధితులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కృష్ణానది, బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సార్లు పరామర్శించి వారికి అండగా ఉన్నారని చెప్పారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక అవధూత ఆశ్రమం దగ్గర అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, అనంత్ డైమండ్స్ అధినేత జాస్తి పద్మ శేఖర్ హజరై 400 మంది బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీ, చెన్నుపాటి గాంధీ, యలమంచిలి దేవేంద్ర, అన్నాభక్తుల బాబి, కడియాల మురళీకృష్ణ, అరసిమెల్లి రమేష్, చిలకలపూడి లక్ష్మీ నరసింహా, మోటపర్తి వరలక్ష్మీ, కడియాల దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు.