జగన్ ఓదార్పు యాత్ర

– కొడాలి నాని

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల్లో వారం రోజులపాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని, ఇంత మంచి చేసినా ఓటమి చెందడం నమ్మశక్యంగా లేదని చెప్పారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.