ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనకు నిరసనగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నా చేసిన విషయం తెలిసిందే.అయితే, ధర్నా జరిగే ఓ సందర్భంలో వైఎస్ జగన్ జాతీయ మీడియాకు దండం పెట్టి వేడుకున్నారు. జాతీయ మీడియా ఏపీలో పరిస్థితులను చూడాలని, కూటమి ప్రభుత్వంలో హత్యలు ఎక్కువయ్యాయని అన్నారు. జాతీయ మీడియా కూడా ఏపీపై దృష్టి పెట్టాలని వైఎస్ జగన్ చేతులు జోడించి వేడుకున్నారు.