ప్రైవేటు టీచర్లను పట్టించుకోని జగన్‌ రెడ్డి

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ, మహానాడు: కరోనా కాలంతో ఆ తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల కష్టాలను జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేద వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్‌ తరఫున వ్యక్తిగత స్థాయిలో తాను సాయం చేశానని గుర్తు చేశారు. మంగళవారం వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రైవేట్‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో ఆంజనేయులు లీలావతి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో తాను ప్రధాని మోదీకి ది సిక్రెట్‌ అనే ఒక పుస్తకం ఇచ్చానని.. రేపు చంద్రబాబు బృందంలో ఎమ్మెల్యేగా మళ్లీ ప్రధాని మోదీని కలిసినప్పుడు దేశవ్యాప్తంగా లీడ్‌ ఇండియా అమలు చేయాలని కోరుతానని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.