-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైకాపా దేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు. శనివారం సిఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యాలన్నింటిని కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి అంటగడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారనందుకు తమ నేత తోట చంద్రయను హత్య చేసిన సంస్కృతి వైకాపా దని అన్నారు.
టిడిపి ప్రభుత్యం హత్యా రాజకీయాలను అసలు ప్రోత్సహించదని అన్నారు. తోట చంద్ర య్య లాగా ఎంతో మంది టిడిపి నేతలను జగన్ రెడ్డి హత్యలు చేయించారని, ఏ మొహం పెట్టుకుని జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తారని ఎద్దేవా చేశారు. గత ఐదు ఏళ్ళలో టిడిపి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే జగన్ రెడ్డి హేళన చేశారని, నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా తమ అధినేతను అవమానించారని, తమ దళిత ఎమ్మెల్యే పై దాడి చేశారని, దీన్ని గమనించే ప్రజలు 11 సీట్లే గెలిపించారని , అయినా జగన్ రెడ్డికి బుద్ధి రాలే దని అన్నారు. జగన్ రెడ్డి బెదిరింపులకు బెదిరేవారు ఏవ్వరు లేరన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలను మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజాలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొంటే మంచిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు చెప్పారు.
5 ఏళ్ల పాటు నేరాలు,ఘోరాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చిన జగన్ రెడ్డి నేడు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడటం విడ్డూరమని మంత్రి పేర్కొన్నారు. రేపల్లెలో అమర్నాధ్ గౌడ్,మాచర్లలో తోట చంద్రయ్య, మదనపల్లిలో ఫాతిమా ఇలా వైసీపీ పాలనలో జరిగిన దారుణ హత్యలు చాలానే ఉన్నాయాన్నారు. ఎన్డీయే కూటమి నెల రోజుల పాలనకే రాష్ట్రపతి పాలన కావాలంటే..మరి నాడు మీ అరాచక పాలనకు మిమ్మల్ని ఈ పాటికి దేశ బహిష్కరణ చేసి ఉండాలని పేర్కొన్నారు. ఇకనైనా మీ వంకర బుద్ది మార్చుకోకపోతే కచ్చితంగా ప్రజలే మిమ్మల్ని దేశం నుంచి తరిమికొడతారు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరించారు. ఢిల్లీలో ధర్నా చేసేముందు ఆంధ్రలోని గల్లీగల్లీలో నీ అరాచక పాలన ఆనవాళ్లకు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తరని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.