జగన్ రెడ్డి లెవన్ రెడ్డి

లెజెండ్ లను చూసి వణికిపోతున్న జగన్ 
జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా  తీసుకోవాలి 
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి 

నెల్లూరు, మహానాడు :  అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ఐదేళ్లుగా అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదని.. 11 సీట్లకే పరిమితమైన  లెవన్ ( తెలుగులో 11 అర్ధం ) రెడ్డి అంటూ కొత్త పేరు పెట్టారు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను మొదటి నెల నుంచే చంద్రబాబు అమలు చేస్తున్నారని వెల్లడించారు..

ఈవీఎం లను ధ్వంసం చేసిన  క్రిమినల్ ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల ఖర్చు పెట్టుకుని నెల్లూరుకు వచ్చారని విమర్శించారు.. అవినీతిపరుడు, క్రిమినల్ గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించడానికి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా అంటూ ప్రశ్నించారు.. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడని ముందే గ్రహించి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో వసతులు చూసేందుకు జగన్ వచ్చాడంటూ ఆయన ఎద్దేవా చేశారు..

రాష్ట్రాన్ని లెవన్ రెడ్డి సర్వనాశనం చేశాడంటూ కోటంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు.. జగన్ ఆర్థిక ఉగ్రవాది కాబట్టే.. అయన కళ్ళకి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మంచోడుగా కనిపిస్తున్నాడని అన్నారు.. పరిపాలన చేతగాని జగన్.. సమర్థత కలిగిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.. తనను కారుతో గుద్దించి.. హత్య చెయ్యాలనుక్కునది మీ పార్టీ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు.. జగన్ బతుకు ఏంటో ఎన్నికల్లో తెలిసిపోయిందన్నారు..

టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే జగన్ నెల్లూరులో అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబులను చూసి జగన్ భయపడి, వణికి పోతున్నాడని ఏద్దేవా చేశారు. జైలు ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుమోటోగా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కార్పొరేటర్  మామిడ్ల మధు,పిట్టి సత్య నాగేశ్వరరావు, కువ్వారపు బాలాజీ, పసుపులేటి మల్లికార్జున్, ప్రశాంత్,  మహేంద్ర రెడ్డి, సుభాన్ బాష, బ్రహ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు