బీసీల పొట్ట కొట్టి పెత్తందార్లకు పట్టం కట్టిన జగన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
నూజండ్ల ప్రచారంలో జీవీ, లావు, మక్కెన

నూజెండ్ల, మహానాడు: రాష్ట్రంలో బీసీల పొట్ట కొట్టి పెత్తందార్లకే పట్టం కట్టిన చరిత్ర హీనుడిగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, అతడి పార్టీ వైసీపీ నిలిచిపోతుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శిం చారు. ఎంతో నమ్మకంతో ఆ పార్టీలో చేరిన తన వంటి బీసీ నాయకులకు అక్కడ మిగి లింది అవమానాలు, అణచివేతలు, చీత్కారాలే అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిగా ఉన్న తనకే అలా జరిగితే వైకాపాలో మిగిలిన బీసీ నేతల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆత్మగౌరవం చంపుకోలేక, పల్నాడు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేయలేకే తాను వైకాపాను వీడాల్సి వచ్చిందన్నారు.

వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూటమి తరపున తొలిసారి విస్తృత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జగన్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు పక్షాన బుధవా రం పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలం ఉప్పలపాడు, గురపనాయుడుపాలెం, నూజండ్ల, రవ్వవరం, బుర్రిపాలెం, ముత్తరాశిపాలెం, పమిడిపాడు, కంభంపాడు, తెల్లపాడు, టి.అన్నవరం, ఐనవోలు, చింతలచెరువు, ముత్యంజయపురం గ్రామాల్లో మండుటెండల్లో సైతం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగానే 30కి పైగా సంక్షేమ పథకాల రద్దు, స్థానికసంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతం తగ్గించడంతో పాటు అనేక విధాలా జగన్‌ బీసీలకు అన్యాయం చేశారన్నారు. అదే సమయంలో వైకాపాలో అంతర్గతంగా కూడా పేరు బీసీలది, పెత్తనం పెద్దలదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలను రాజకీయ నాయత్వానికి దూరం చేయడంతో పాటు విద్య, వ్యాపార రంగాల్లో కూడా దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం వైకాపాది మాత్రమే అని దుయ్యబట్టారు. వైసీపీ నుంచి ఎంపీ లావు, తానూ తెలుగుదేశం పార్టీలో చేరడానికదే కారణమని వ్యాఖ్యా నించారు. జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జగన్‌ 100కు పైగా సంక్షేమ పథకాలు రద్దుచేశారని వాపోయారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వరికెపుడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, జలజీవన్‌ మిషన్‌, వాటర్‌గ్రిడ్‌ ద్వారా వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకుడు నాగశ్రీను రాయల్‌, మీసాల మురళీకృష్ణ యాదవ్‌, లగడపాటి వెంకట్రావు, ముండ్రు సుబ్బారావు, బచ్చు అంజిరెడ్డి, సోమేపల్లి బ్రహ్మయ్య, రొడ్డా వీరాంజనేయరెడ్డి, లగడపాటి సూరి, చందా రావు, కాకాని హరిబాబు, గంగినేని అంజయ్య, కాకాని వీరాంజనేయులు, బత్తుల గోవిందరాజులు, మరిడి సురేష్‌, బత్తుల సుబ్బారావు, వడ్లమూడి గాలెయ్య, బాల గురవయ్య, గర్నపూడి ఈశ్వరయ్య, కట్టెంపుడి బర్నబాస్‌, గుంజరి పున్నయ్య, నక్క బుల్లేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.