దళిత హంతకులకు పదవులిస్తున్న జగన్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి

తోట త్రిమూర్తులు టికెట్‌ను రద్దు చేయాలి
టీడీపీ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు

మంగళగిరి: దళితులను అవమానిస్తున్న, వారిపై నేరాలకు పాల్పడుతున్న జగన్‌కు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో స్వాగతిస్తున్నా మని, ఆయనకు టికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులంటే జగన్‌ రెడ్డికి చిన్నచూపు.. అందుకే దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబును ప్రక్కన పెట్టుకున్నాడన్నారు. రాబో యే ఎన్నికల్లో దళితులంతా ఏకమై దళిత వ్యతిరేక పార్టీ వైసీపీకి, దళిత్ర ద్రోహి జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని, దళిత ద్రోహులకు, దళిత వ్యతిరేకులపై రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.