విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.