తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు దోచుకున్న జగన్‌

– వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

వేమూరు, మహానాడు: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు జగన్‌ రెడ్డి దోచుకున్నారని, తన అధికారంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని గాడిని పెడతాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపించారు. అమర్తులూరు మండలం యలవర్రు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని, గడపగడపకు తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… యువతకు చదువుతోపాటు ఉద్యోగ భరోసా కల్పిస్తాం. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాన్ని 2047 విజన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తాం. అధికారంలోకి రాగానే ముందు మూడు నెలలు వచ్చిన నెలతో కలిపి 7000 పెన్షన్ అందించాం.

వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఇవ్వలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు పై బురద జల్లి 50 మంది ముసలివాళ్ల చావుకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయం సిబ్బందితో ఒక్కరోజులో 99% పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తున్నామన్నారు. 2000 కు దొరికే ఇసుక ట్రాక్టర్ ని 7000 కి పెంచేసిన జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2000 కే ట్రాక్టర్ ఇసుక. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది.

జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలన చూసి ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు ఈ విజయం మీది. కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చిన మీకు బాధ్యతతో పని చేస్తామన్నారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకోటమే కాకుండా వేల కోట్లు దోచుకున్నారు. తిరుపతి లడ్డు పవిత్రతను దెబ్బతీశారు. జంతువుల కొవ్వులు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.