క్రిమినల్ రికార్డ్ ఉన్నంత వరకూ జగన్ పేరు ఉంటుంది
వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు..చేశాడా?
రంజాన్ మాసం వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం
5 ఏళ్లలో క్రమ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం
తాడిపత్రి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తాడిపత్రిలో నంబర్-1 యువకుడు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి కుర్రాడిలా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు పోరాడాలి. రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు…ఆయన పేరు సైకో జగన్. సభకు సిద్ధం అని పేరు పెట్టుకున్నారు. ఎవరన్నా పులినో..సింహాన్నో చూసి భయపడతారు..కానీ ఈ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ను చూసి కూడా భయపడ్డాడు. అక్కడ సభలో గ్రీన్ మ్యాట్ వేశాడు. ప్రజలు రారని గ్రాఫిక్స్ చేయాలని చూశాడు. దొంగ ఛానెల్ సాక్షి విజువల్ లో కూడా ఖాళీగా కనిపించింది.
కానీ అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను తిట్టారు. డ్రోన్ నేను పంపించి ఖాళీ కుర్చీలు తీయించానని అన్నారు. అంటే సిద్ధం సభకు ప్రజలు వచ్చేందుకు సిద్ధంగా లేరని ఇద్దరు దొంగలు చెప్పారు. బాహుబలి ట్రైలర్ చూపించి…పులికేసి సినిమా చూపించింది సైకో ప్రభుత్వం. ఎవరన్నా లైవ్ చూశారా…సీఎంకు బాగా చెమటపట్టింది. భయం, టెన్షన్ పుట్టింది. దానికి కారణం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుకోవడమే. జగన్ ఎక్కడికి వెళ్లినా భయపడేది ఈ పొత్తు వల్ల.
చరిత్ర ఉన్నంత వరకూ సైకో ఉంటాడంట..క్రిమినల్ రికార్డ్ ఉన్నంత వరకూ జగన్ పేరు ఉంటుంది. చంచల్ గూడ జైలులగోడలపై ఆయన పేరు ఉంటుంది. క్విడ్ ప్రోక్, వైట్ కాలర్ నేరస్తుడిగా జగన్ మిగలడం ఖాయం.మాట ఇస్తే తప్పడంట…ఎన్నికల ముందు ఏం చెప్పాడు.? సంపూర్ణ మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు, చేశాడా.? వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు..చేశాడా.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్నాడు..ఇచ్చాడా..ఇవ్వలేదు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాన్నన్నాడు.. యేటా 6,300 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. ప్రతియేటా మెగా డీఎస్సీ అన్నాడు..చేశాడా.? ఈ మధ్య జగన్ కు ప్రచార పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడ చూసినా పోస్టర్లు పెట్టుకుంటున్నాడు. మరుగుదొడ్ల తలుపులపైనా పోస్టర్లు పెట్టుకున్నాడు.
ఇచ్చిన హామీలు 6 నెలల్లో అమలు చేస్తే చిత్తశుద్ధి అన్నాడు…చివరి ఆరు నెల్లలో అమలు చేస్తే మోసం అన్నాడు. 4 ఏళ్లు 10 నెలలు ఇంట్లో పడుకుని 2 నెలలు ముందు బయటకు వచ్చి గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చాడు. ప్రతి గడపలో నిరుద్యోగ యువకులు ఉన్నారు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి బాగా చదివించినా ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. 800 గ్రూప్ 2 పోస్టులు వేస్తే 5 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు.
అందుకే నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా…2 నెలలు ఓపికపట్టండి, టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం రాగానే 5 ఏళ్లలో క్రమ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యేటా డీఎస్సీ నిర్వహిస్తాం. సైకో జగన్ ప్రచార పిచ్చితో పరీక్ష పేపర్లలో కూడా జగన్ గురించే ప్రశ్నలు వేసుకున్నాడు. ఆదుడాం ఆంధ్ర, జీవన్ క్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు అడిగారు.
అడగాల్సింది అవికాదు జగన్….బాబాయ్ ని లేపేసింది ఎవరు? తల్లీచెల్లిని బయటకు పంపింది ఎవరు.? సీసీఎస్ పై మాట తప్పింది ఎవరు.? 31 లక్షల ఇళ్లు కట్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని మాట తప్పింది ఎవరు అని అడిగితే పరీక్ష రాసినవారందరికీ మంచి మార్కులు వచ్చేవి. జగన్ పదేపదే ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు. దానికి పర్ ఫెక్ట్ పేరు కోడికత్తి వారియర్స్.
సొంత బాబాయ్ ని పొడిచి చంపినందుకు సీనియర్ బ్యాట్స్ మెన్ గా అవినాష్ రెడ్డి, బెట్టింగ్ గా స్టార్ అనిల్ కుమార్, అరగంట స్టార్ గా అంబటి, గంటస్టార్ అవంతి, ఆలో రౌండర్ గా గోరంట్ల మాధవ్. పార్లమెంట్ లో ఆవరణలో రీల్స్ చేసుకునే య్యూటూబ్ స్టార్ రీల్ మాస్టర్ ఎంపీ భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి నాని, పిన్ షిట్టర్ బియ్యపు మధుసూధర్ రెడ్డి. ఈ టీంను శాశ్వతంగా మీరు ఇంటికి పంపండి.
అయ్యో పాపం బొత్స…ఆయన చెప్పేది ఆయనకే అర్థం కాదు. ఎక్కువ మంది చదవుకోవడం వల్ల ఉద్యోగాలు రావడం లేదంట…మరి నీకు మంత్రి పదవి ఎందుకు తప్పుకుని ఇంటికెళ్లు.జగన్ ఒక అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. రెండు బటన్లు ఉన్నాయి. బులుగు బటన్ నొక్కి రూ.10 అకౌంట్లో వేస్తాడు..ఎర్ర బనట్ నొక్కి వంద నొక్కేస్తాడు.
తాడిపత్రిలోని మైనారిటీలకు విజ్ణప్తి చేస్తున్నా. ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. 2014లో టీడీపీ-బీజేపీ ఆనాడు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం.
రంజాన్ మాసం వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. మసీదులకు రంగులు వేసేందుకు డబ్బులు ఇచ్చాం. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చాం, దుల్హన్ పథకం ద్వారా పెద్దఎత్తున నిధులు అందజేశాం. జగన్ వచ్చిన తర్వాత మైనార్టీలపై దాడులు పెరిగాయి. ఏకంగా వీడియో పెట్టి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
పలమనేరులో మిస్బా అనే చెల్లి బాగా చదువుతోందని వైసీపీ నేత తన కుమార్తె సెకెండ్ వస్తోందని చెప్పి టీసీ ఇచ్చారు. దీంతో మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. నర్సరావుపేటలో వక్ఫ్ భూముల ఆస్తుల రక్షణకు పోరాడిన ఇబ్రహీంను ఎమ్మెల్యే నడివీధిలో చంపించాడు. జగన్ కు ఛాలెంజ్ విసురుతున్నా. టైం, డేట్ ఫిక్స్ చేయ్…బీసీలకు నువ్వేం చేశావో…మేమేం చేశామో చర్చిద్దాం…సిద్ధామా?
సలహాదారులను పంపించడం కాదు. అన్నింటిలో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డిని పంపడం కాదు. నేరుగా నువ్వేరావాలి. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించాడు. 26 వేల మంది బీసీలపై దొంగ కేసులుపెట్టారు. 300 మంది బీసీలను చంపించాడు.
తాడేపల్లిలో పెద్దపిల్లి ఉంది…తాడిపత్రిలో చిన్నపల్లి ఉంది…దానిపేరే పెద్దారెడ్డి.ప్రభాకర్ రెడ్డి ఇంట్లోలేని సమయంలో పీకేవాడిలా ఇంటికెళ్లి అహంకారంగా వ్యవహరించారు. పులి పులే…పిల్లి పిల్లే. పిల్లివెళ్లి సింహాసనం మీద కూర్చుంటే పులి అవ్వదు పెద్దారెడ్డి. చంద్రబాబు చిటిక వేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా?
మన పులిబిడ్డ అస్మిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటా. పెండేకల్లు ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. మూతబడ్డ గ్రానైట్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి తెరిపిస్తాం. విద్యుత్ చార్జీలు పెంచారు. పెద్దారెడ్డి ట్యాక్స్ తో ఇబ్బంది పుడుతున్నారు.