కార్మికుల వలసలకు జగనే కారణం 

ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు 

ప్రత్తిపాడు, మహానాడు: భవన నిర్మాణ కార్మికుల వలసలకు జగనే కారణమని ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారన్నారు. 2014 లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు. దాంతో ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు వలస బాట పట్టారు. జగన్ మోహన్ రెడ్డి జేపీ సంస్థకు ఐదువేల కోట్లు దోచి పెట్టారు.

వైసీపీ నాయకులు దాచుకున్న ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. మా ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు ఆలోచన లేదు. కేవలం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం వదిలిపెట్టదు. ఎక్కడ ఉన్నా పట్టుకొస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ద ప్రాతిపదికన మొదలు పెట్టామని ఆంజనేయులు తెలిపారు.