– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆరోపణ
గుంటూరు, మహానాడు: మాజీ సీఎం జగన్ దళితులను రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని పెద్ద కుట్రకు తెర లేపారని, దళితులు కూడా హిందువులే అనే విషయం జగన్ మర్చిపోయారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన చంద్రమౌళి నగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంతో అధికారులు అంటకాగి వ్యవస్థలను ధ్వంసం చేశారు. హిందువులు మాత్రమే కాదు అన్ని మతాలు వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. గత ప్రభుత్వం క్రిస్టియన్లను ఛైర్మన్లు గా నియమించింది. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 18 సార్లు కల్తీ నెయ్యిని వెనక్కి పంపించినట్లు జగనే చెప్పారు. అటువంటి కంపెనీలను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు. మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడికి పారిపోయారు.
హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదంలో కల్తీ చేయడం దారుణం. కల్తీ జరిగిన విషయం లాబ్ రిపోర్టులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈవో గా ఉండి టెండర్లు ఖరారు చేసిన ధర్మారెడ్డి ఇప్పుడు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు.
వైసీపీ పాలనలో తిరుమలకు వచ్చే భక్తులను దోపిడీ చేశారు. డిక్లరేషన్ పై జగన్ ఎందుకు సంతకం పెట్టలేదు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పరమత ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మాజీ సీఎంకు లేదా? డిక్లరేషన్ పై సంతకం పెడితే క్రిస్టియన్లు ఆమోదించరని అనుకుంటున్నారా? జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినా విసా అడిగారా లేదా?
జగన్ తిరుమల వెళ్ళి దళితులను రెచ్చగొట్టాలని చూశారు. దళితులు క్రిష్టియన్లు అని మీకు చెప్పారా? డిక్లరేషన్ పై సంతకం చేస్తే అన్యమతస్థులు దర్శనం చేసుకోవచ్చు. జగన్ తిరుమలకు వెళ్లి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చారు. పఠాన్ సినిమా విజయం సాధించిన తర్వాత షారుక్ ఖాన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. వారందరికీ లేని ఇబ్బంది జగన్ కు ఎందుకు? నిజమైన క్రిస్టియన్ ఎవరూ ఇతర మతాలపై దాడి చేయరని వాటికన్ అధిపతి పోప్ చెప్పిన విషయం జగన్ తెలుసుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి పోప్ కట్టే గొప్పవారు కాదు. జగన్ కుట్ర రాజకీయాలు జనం గ్రహించి 11 సీట్లతో సరిపెట్టారు. డ్రామా ఆర్టిస్టు రోజా వందల మందిని టికెట్స్ లేకుండా దర్శనం చేయించారు. ఇప్పటికైనా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు వెంబడించి దేశం వదిలి పోయే వరకు తరిమి తరిమి కొడతారు. బీజేపీ ఎంపీలకు టీటీడీ వ్యవహారంలో సంబంధం ఉందని జగన్ అనడం తిక్కల తనంగా భావించాలి. నిజమైన క్రిష్టియన్ ఇతర మతాలను ద్వేషించరని పోప్ చెప్పారు. పోప్ కన్నా జగన్ గొప్పవారా.. గొప్ప ఆలోచనపరులా…? బీజేపీ హిందువుల కోసమే కాదు… ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ప్రతి ఆరేళ్ళకొకసారి బీజేపీ నూతన సభ్యత్వం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ రెండో తేదీన ప్రధాని నరేంద్రమోడీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. అవినీతిరహిత పార్టీగా బీజేపీకి దేశ వ్యాప్తంగా పేరు ఉంది. అటువంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇప్పటికి 12లక్షలు సభ్యత్వం పూర్తి చేశాం.
ఈసంఖ్య మరింతగా పెంచేలా అందరం కలిసి పని చేస్తాం. ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఇంచార్జి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సభ్యత ప్రముఖ్ పాలపాటి రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి తిరుపతిరావు, ధార్మిక సెల్ అధ్యక్షుడు ప్రతాప్ ప్రసాద్, తుళ్లూరు అసెంబ్లీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య, మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.