• 11 సీట్లకు పరిమితమైనా తత్వం బోధ పడలేదు
• మళ్లీ అధికారం కోసం కుతంత్రాలు
• ఆ కుట్రలో భాగమే.. పత్తికొండలో టీడీపీ నేత దారుణ హత్య
• టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణ
మంగళగిరి, మహానాడు: జనాలను చంపి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని గోల పెట్టాలని జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్టు జనం కోడై కూస్తోన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి పెద్ద గోబెల్స్ రెడ్డి అని.. 11 సీట్లకు పరిమితమైనా జగన్ కు ఇంకా ప్రజాభిప్రాయం బోధ పడలేదన్నారు. ఎస్కోబార్ కు జగన్ రెడ్డికి పెద్ద తేడాలేదన్నారు.. అధికారం కోసం జగన్ రెడ్డి కుతంత్రాలు దుర్మార్గపు దుష్ట ఆలోచనలు చేస్తున్నాడన్నారు. ఇంకా.. ఆయన మాట్లాడుతూ.. పొయిన అధికారాన్ని ఎలాగైనా తిరిగి పొందాలని తపన పడుతున్నారు.
ప్రజలు జగన్ ను ఛీ కొట్టి.. చంద్రబాబును జై కొట్టారని ఇంకా అతనికి తెలియక పోగా.. కొత్త కుట్రకు తెరలేపారు… ఆ కుట్రను అమలు చేయడానికి కోట్ల రూపాయాలు ఖర్చుచేయానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కుట్రలో భాగమే.. పత్తికొండలో శ్రీనివాసులు అనే టీడీపీ నాయకున్ని దారుణంగా హత్య చేయించడం. రాష్ట్రంలో కొన్ని హత్యలు చేయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పాలనదే జగన్ ప్రణాళిక అని జగనం చర్చించుకొంటున్నారు. జగన్ కు తెలిసే బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను కారం కొట్టి దారుణంగా కత్తులతో చంపారు.
కుట్రలతో జనాలను చంపి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి జగన్ యత్నిస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టిన జగన్ అక్కడ చనిపోయిన 33 మంది పేర్లు చెప్పమని అడిగితే దొంగకు తేలు కుట్టినట్టు కిమ్ముమనకుండా ఉన్నాడు. జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే 33 మంది పేర్లను ఇప్పుడే చెప్పాలని సవాల్ విసురుతున్న. రాయదుర్గంలో ఆదెప్పను చంపింది వైసీపీ నేతలే కదా..? ఆళ్లగడ్డలో శ్రీదేవి, తాడిపత్రిలో లాల్ బాషా, పత్తికొండలో గోపినాథ్ చౌదరి, దుగ్గిరాలలో కాశీం నేడు మళ్ళీ పత్తికొండలో శ్రీనివాస్ ఏడుగురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు పక్కా ప్రణాళికతో హతమర్చింది నిజం కాదా జగన్? జగన్ రెడ్డి 174 నియోజకవర్గాలకు డబ్బులు పంపి అరాచకం సృష్టించి అమాయకులను చంపాలని ఆదేశాలు ఇచ్చని రాష్ట్ర ప్రజలంతా కోడై కూస్తోన్నారు.
ఇంటిలిజెన్స్ అలెర్ట్ అవ్వాలి… జగన్ రెడ్డి కుట్రను బహిర్గతం చేయాలి. ఇకపై రాష్ట్రంలో ఒక్క మర్డర్ కూడా జరగకుండా చూడాలి. లా ఆండ్ ఆర్డర్ ను ఎలా మెయిన్ టెయిన్ చేయాలో … రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా కాపాడాలో తెలిసిన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు నేడు సీఎంగా ఉన్నారు. లోకల్ పోలీసులు కూడా అలర్ట్ గా ఉండి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టాలి.
ఎస్కోబార్ కు జగన్ రెడ్డికి పెద్ద తేడాలేదు.. ఎస్కోబార్ కు జగన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. జగన్ ఇంటిపై నిఘా పెట్టాలి… జగన్ ఏం చేయబోతున్నాడో ఎవరెవర్ని కలవబోతున్నాడో అతని దుర్మార్గపు ఆలోచనలను ఎప్పటికప్పుడు కనిపెట్టాలి. దుర్మార్గపు సొమ్ము, దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న నేతలపై నిఘా పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి… పోలీసులు అలెర్ట్ గా ఉండాలి.