జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం

కడప: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.