ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్

-జగన్ రెడ్డి జబ్బు పేరు డయేరియా
-చంద్రబాబు నాటిన తులసిమొక్క .. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్క

-మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది
-శంఖారావం సభకు వైకాపా దిష్టి
– పార్వతీపురం శంఖారావం సభలో యువనేత లోకేష్

మా శంఖారావం సభకు వైకాపా దిష్టి తగిలినట్లుంది. మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు,నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు. ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉద్యమాల, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. ఫ్యాన్ కు షాకిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది రాజసం.

ఉత్తరాంధ్ర అంటే పైడితల్లి అమ్మవారు గుర్తుకువస్తారు. అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇలాంటి పవిత్ర నేలపై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒక జబ్బు వచ్చింది. జబ్బు పేరు డయేరియా. కావాలంటే తాడేపల్లి కొంపకెల్లి పరీక్షలు నిర్వహిద్దాం.

ఇదో చెత్త ప్రభుత్వం. నిన్నగాన మొన్న గుంటూరులో సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితి లేక కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నా దున్నపోతు ప్రభుత్వానికి సమీక్ష చేసే తీరిక లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. టీడీపీ మహానాడులో చంద్రబాబు నాటిన తులసిమొక్కను అన్నారు. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కలా ఎలా మారారో చెప్పాలి.

జగన్ రెడ్డి సినిమా పిచ్చి ఎక్కువైంది. ఓ వైపు వ్యూహం, మరోవైపు యాత్ర సినిమా అంటారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా సినిమా చూడటం లేదు. సినిమా అట్టర్ ప్లాప్. వైకాపా పని అయిపోయింది, ఇక అంతిమయాత్రే అంటున్నారు. మొదటిరోజు కూడా ఎవరూ చూడలేదు.

కానీ సినిమా తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆదుకోమంటే చీ పో అన్నారు. అతడికి కోపం వచ్చి అంతిమయాత్ర పోస్టర్ వేసి చూపించారు. డబ్బులు ఇవ్వకపోతే అంతిమయాత్ర సినిమా తీస్తాననడంతో భయపడిపోయి, హార్సిలీహిల్స్ ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారు.

అది ప్రజల కోసం తీసిన సినిమా కాదు.. మీ మెప్పు కోసం తీసిన సినిమా. వాళ్లకు భూమి ఇవ్వాలనుకుంటే తాడేపల్లిలో, ఇడుపుల పాయలో కానీ రెండు ఎకరాలు ఇవ్వొచ్చు కదా. బెంగుళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది కదా. అందులో రెండు ఎకరాలు ఇవ్వొచ్చు కదా.

జగన్ ను చూస్తే పిట్టల దొర గుర్తుకు వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేలో ఆంధ్రాను ఆడుదాం ఆంధ్రా అని మార్చారు. అది కాస్తా విఫలమైంది. మా జీవితాలతో ఆడింది చాలు, ఇక వెళ్లండి అని జనం ఛీకొట్టారు. ఎన్నికల ముందు నియోజకవర్గానికో స్టేడియం నిర్మిస్తామన్నారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటుచేస్తామన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా అవి ఏర్పాటుచేశారా?

జగన్ ఐపీఎల్ టీం పెడతామంటున్నారు. దాని పేరు కోడికత్తి వారియర్స్ . ఆ టీమ్ లో ప్లేయర్స్ గా బాబాయిని గొడ్డలితో నరికిచంపిన ఆల్ రౌండర్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాట్స్ మెన్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్, బూతుల స్టార్, కొడాలి నాని, కమిడియన్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆటగాళ్లుగా ఉంటారు.

25కు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. మొత్తం వైసీపీకి 31 మంది ఎంపీలు ఉంటే ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగిరా? ప్రత్యేక హోదా కాదు కదా.. కేంద్రంలో మన పరువు తీశారు. ఒక ఎంపీనేమో జిప్పులు విప్పదీసి అన్నీ చూపిస్తాడు, మరో ఎంపీ బాబాయిని లేపేసిన వ్యక్తి. ఇంకో ఎంపి సీబీఐ వస్తే కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు. ఓ ఎంపీ టిక్ టాక్, యూట్యూబ్ రీల్స్ లో బిజీగా ఉంటాడు. విశాఖ ఎంపి భార్య, కొడుకుని కిడ్నాప్ చేశారనే భయంతో ఏకంగా హైదరాబాద్ వెళ్లి దాక్కుంటాడు.ఇక ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఎ2గా ఉన్నారు. జగన్ చేసిన అవినీతి లెక్కలన్నీ పుస్తకంలో రాసుకోవడం ఆయన పని.

వైకాపా నాయకులు సామాజిక బస్సుయాత్ర చేస్తున్నారు. అసలు వైకాపాలోనే సామాజిక న్యాయం లేదు. ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు. 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేశారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీలే ఉన్నారు. వారి పార్టీకి చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు.

వైసీపీ ఎంపీ సంజీవ్ కూడా తనకు తగిన గౌరవం లేదని చెప్పారు. బీసీలను ఎదగనివ్వడం లేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించి 16,500 పోస్టులు దూరం చేశారు.

అమర్ నాథ్ గౌడ్ అనే విద్యార్థిని కిరాతకంగా కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. తన అక్కను ఏడిపిస్తున్నారని అడిగినందుకు వైకాపా నేత ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఆ సోదరుడి అక్కను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు. బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అన్నారు. ఇప్పుడు జగన్ వారి వెన్నెముకను విరుస్తున్నారు.జయహో బీసీ నినాదంతో బిసిలంతా జగన్ రెడ్డిని గద్దె దించాలి. ఏపీ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు అందరూ కలిసికట్టుగా నడవాలి.

జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బునుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10వేసి, బల్లకింద ఉన్న రెడ్ బటన్ తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. లిక్కర్ రేట్లు పెంచారు. చెత్తపైన పన్ను వేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్ లు కట్, .. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

మీ కష్టాలను తీర్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. అందుకే చంద్రబాబునాయుడు- పవనన్న సూపర్-6 హామీలు ప్రకటించారు.యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది.ప్రతి రైతుకు అండగా నిలబడేందుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. ఒక్క ఇటుక వేయలేదు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.

ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పి మోసం చేశారు. ఏకంగా రూ. 500 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కనీసం భూములు కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దలు పోరాడి తీసుకువచ్చారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నారు. అవసరమైతే ఆ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ బాధ్యత మనం తీసుకుంటాం.

పాదయాత్రలో విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తిచేస్తామన్నారు, చేశారా? రామతీర్థం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేదు. గోస్తా-చంపావతి నదుల అనుసంధానం చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి చేయలేదు. సాలూరు బై పాస్ రోడ్డు, పాలేరు నదిపై డ్యా నిర్మాణం, స్వర్ణముఖి-చింతగడ్డపై బ్రిడ్జిపై నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా? పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నిలబెట్టుకోలేదు.

నాడు నేడు ఎప్పుడూ విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు నిర్మించాం. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు భూసేకరణ చేశాం. టిడ్కో ఇళ్లు కట్టించాం. అయినా 2019లో మనం ఓడిపోయాం. పార్వతీపురంలో చిరంజీవి మాస్టారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రూ.350 కోట్ల తండాలకు రోడ్లు వేశాం. పార్వతీపురం హెడ్ క్వార్టర్ లో పేదలకు 560 టిడ్కో ఇళ్లు నిర్మించాం. 66 కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేశాం.

జంఝావతి రిజర్వాయర్ కు రూ.43 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసింది.హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆనాడు ఏర్పాటుచేశాం. టీడీపీ పాలనలో పార్వతీపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. నేడు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జోగారావు. ఆయనను అవినీతి రావు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారు. ఎక్కడ చెరువు కనిపించినా పట్టాలు సృష్టిస్తున్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారు. పెద్దసైకో జగన్ రెడ్డి అయితే చిన్న సైకో జోగారావు. ఏకంగా ఎమ్మార్వో సంతకాన్నే ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎంక్వైరీ వేసి, ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇస్తాం.

2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురానికి బైపాస్ రోడ్డు వేస్తాం, జంఝావతి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆడారు మినీ రిజర్వాయర్ ద్వారా తండాలకు మంచినీరు ఇస్తాం, సీతానగరం, బలిజపేట మండలాలకు తోటపల్లి నుంచి సాగునీరు అందిస్తాం.
పార్వతీపురం శివార్లలో డంపింగ్ యార్డ్ తీసుకువచ్చే బాధ్యత, పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకుంటాం. స్పోర్ట్ స్టేడియం నిర్మిస్తాం.

టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ. వైకాపా వారికి ఉత్సాహం రావాలంటే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి. మన కార్యకర్తలకు పసుపు జెండాను చూస్తే ఉత్సాహం వస్తుంది. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వంద కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లలను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.

అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. మన టీడీపీ కౌన్సిలర్ నారాయణ రావు గారిని కొట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. దానికి కారణం తాగునీరు అందించాలని, వార్డుని డెవలప్ చేయాలని అడగడమే? ఆయనపై కేసులు పెట్టి పది రోజులు వార్డుకు తాగునీరు రాకుండా చేశారు. ఎంత అన్యాయం? చట్టాన్ని అతిక్రమించిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నా. వారిని జైలుకు పంపిస్తాం.

నాపై 22 కేసులు పెట్టారు. రెడ్ బుక్ పైనా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఇక్కడే ఉంటా రండి. చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. 40 ఏళ్లు ప్రజాసేవ చేశారు. ఆయనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. అవినీతిపై చర్చకు సిద్ధం.వైసీపీ పాలనలో ఎక్కువ కేసులున్న కార్యకర్తలకు అంతపెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాం. వచ్చే రెండు నెలలు కష్టపడి టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలి. మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. మన లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రం నుంచి సైకో జగన్ ను తరిమికొట్టాలి