గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు

16 సంక్షేమ పథకాలు రద్దు చేసి మోసం
రూ.5 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టించారు
గిరిజనులపై దాడులను అడ్డుకోని దుర్మార్గులు
ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ధారూ నాయక్‌

మంగళగిరి, మహానాడు : గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎస్టీ కార్పొ రేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ధారూ నాయక్‌ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వ హించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలంటూ మాయ మాటలు చెప్పి 87 శాతం గిరిజన ఓట్లు పొంది వారిపైనే అక్రమ కేసులు పెట్టి హత్యలు చేయించాడని ఆరోపించారు. డీటీడబ్ల్యూవోలను తొలగించి గిరిజనులకు ఉపాధి లేకుండా చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గిరిజ నుడైన ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర గిరిజనుల పై జరుగుతున్న దాడులను కూడా ఖండిరచలేదని, పల్నాడు జిల్లాలో గిరిజన మహిళలను ట్రాక్టర్లతో తొక్కించి చంపినా మాట్లాడలేదని దుయ్యబట్టారు.

వైసీపీ అనుచరులకు అటవీ హక్కుల పాసు పుస్తకాలు
కేంద్రం విడుదల చేసిన పంచాయతీ నిధులను పక్కదారి పట్టించారని, ఐటీడీఏలలో పోస్టులు అన్నీ ఖాళీగానే ఉన్నా గిరిజనులకు ఉద్యోగాలు కల్పించ లేదన్నారు. అటవీ హక్కుల పాసు పుస్తకాలను వైసీపీ అనుచరులకు కేటా యించి గిరిజనులకు అన్యాయం చేశాడని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. గిరిజనుల కు సంబంధించి రూ.5 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టించారని విమర్శించా రు. గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గిరిజనులే బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.