దళితులపై జగన్‌ కపటి ప్రేమ

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు

మంగళగిరి: మాదిగల గెలుపే చంద్రబాబు గెలుపని, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ను భారీ మోజార్టీతో గెలించుకోవాల్సిన బాధ్యత మాదిగలపై ఉందని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. శుక్రవారం సాయంత్రం మం గళగిరి అమరావతి ప్రెస్‌ క్లబ్‌లో మాదిగ సంఘాల జేఏసీ నేతల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. దళిత ద్రోహి జగన్‌ ఓటమే లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో నవ్య మాదిగ చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజేండ్ల సుబ్బారావు, బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్‌ మాజీ అధ్యక్షుడు కట్టెపోగు బసవయ్య, ఎపి ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చేట్టేం సుజనరావు, ఎస్సీ ఎస్టీ హాక్కుల పరిరక్షణ మండలి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి ప్రభుదాసు పాల్గొన్నారు.