– ఆ సొమ్మంతా ప్రజలదే…
– అవినీతి నోట్లను కక్కించే రోజు దగ్గరలోనే ఉంది
– గత ఐదేళ్లలో దోచేసింది రూ. వేల కోట్లు
– ‘సాక్షి’కి ధారపోసింది రూ. వందల కోట్లు
– ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తా…
– మంత్రి నారా లోకేష్ నిప్పులు
– హాట్‌టాపిక్‌గా మారిన ‘ఎక్స్’లోని హెచ్చరిక
విజయవాడ, మహానాడు: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గర్లోనే ఉందంటూ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన హెచ్చరిక చర్చనీయాంశమైంది. జగన్ గత ఐదేళ్లలో దోచేసిన వేల కోట్లు, సాక్షి మీడియాకి ధారపోసిన వందల కోట్లు, కోట్లాడి రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గుట్టలుగా నోట్ల కట్టలు జగన్ పోగేసుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేసిన జగన్, మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తుంటారని మండిపడ్డారు.