– జగన్‌పై తిరుగుబాటు బావుటా
– పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
– జగన్ నమ్మించి మోసం చేశారని ఫైర్
– మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు
– ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీలోనూ చూడలేదని విస్మయం
– ఎన్నిల్లో తాను- భార్య ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని సవాల్
వైసీపీ అధినేత జగన్‌పై తిరుగుబాటుబావుటా ఎగురవేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల సంఖ్య రోజురోజుకూ చాంతాండంత పెరుగుతోంది. తాజాగా కరుడుగటిన్ట వైఎస్ వీరాభిమాని, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన ఎమ్మెల్యే- పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, జగన్‌కు ఝలక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను, భార్య రాయదుర్గం-కల్యాణదుర్గం నుంచి విడివిడిగా ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా పోటీ చేసి తీరతామని జగన్‌కు సవాల్ చే శారు.
ఇలాంటి సీఎంను, ఇలాంటి వ్యక్తిని తాను ఏ పార్టీలోనూ చూడలేదన్న రామచంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే… వైకాపా పెడితే 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకుని వచ్చా. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైకాపా లోకి వచ్చా. నాకు మంత్రి పదవి ఇస్తానన్న జగన్ ..ఇవ్వ లేదు. రాత్రనకా పగలనకా గడపగడపకు తిరిగాం.ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశాం. సర్వే రిపోర్టు పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది. టికెట్ ఇవ్వడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఇంతకన్నా అవమానం మరోటి లేదు.
వైకాపా పార్టీ నుంచి మేము వెళ్లిపోతున్నాం. మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు. మా జీవితాలు సర్వ నాశనమయ్యాయి. ఈ రోజుకీ జగనే మా సర్వస్వం అని భావించాం. జగన్ ను మా దేవుడితో సమానంగా చూశాం. ఇలా నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదు. రామచంద్రారెడ్డి అంటే కరడుకట్టిన జగన్ ,వైఎస్ ఆర్ అభిమాని. మేం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. కనీసం జగన్ మమ్మల్ని కలిసేందుకు ఇష్టపడలేదు.
మా ఆవేదన చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కలవనివ్వలేదు. సీఎం బిజీగా ఉన్నారని , కలిసేందుకు వీలుకాదన్వారు. ఏ పార్టీ తోనూ ఇప్పటి వరకు కనీసం చూడలేదు. రాయదుర్గం ,కళ్యాణ దుర్గం నుంచి మేము పోటీ చేస్తాం. కళ్యాణదుర్గం నుంచి నేను ఇండి పెండంట్ గా నైనా పోటీ చేస్తా. రాయదుర్గం నుంచి నా భార్య పోటీ చేస్తారు. ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసి గెలిచే సత్తా మాకు ఉంది.