-ముగ్గురు ప్రధాన కార్యదర్శుల నియామకం
– అందులో ముగ్గురు రెడ్లే
– శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి చెవిరెడ్డిలకు కొత్తగా సమన్వయ బాధ్యతలు
వైసిపి ని ఓటమి బాట నడిపించిన ఆ పార్టీ అధినేత జగన్ కు.. ఇంకా కుల పిచ్చి పోయినట్లు లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో.. తన పార్టీపై ఉన్న కులముద్ర ను చెరిపేసి.. ‘అందరి వాడి’నని అనిపించుకుంటారన్న భ్రమలు ఆ పార్టీ నేతలకు తొలగిపోయాయి.
తాజాగా సమన్వయం కోసం నియమించిన ముగ్గురు ప్రధాన కార్యదర్శుల పేర్లు పరిశీలిస్తే.. జగన్ తన పార్టీలో రెడ్డి కార్పెట్ కొనసాగించేందుకు..ఏమాత్రం భయపడటం లేదని స్పష్టమవుతోంది.
ప్రధాన కార్యదర్శులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీష్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమించడం ద్వారా తనది రెడ్డి పార్టీ నే అని జగన్ విస్పష్టంగా ప్రకటించి నట్లయింది.
అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నియామకాలు చేశారు. వైయస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు.
- బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను నియమించారు.
- ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబును నియమించారు.
- చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు.
- విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.
- ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు.