పచ్చిగా మాట్లాడితే హత్యా రాజకీయాలే
ఎక్కడ చూసినా మాఫియా..మాఫియా
పలమనేరు వైసీపీ అభ్యర్థి అదే అట
నదిలో ఇసుకను దోచేస్తున్నాడట
మళ్లీ గెలిపిస్తే పలమనేరును అమ్మేస్తాడు
పలమనేరు బహిరంగ సభలో
పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా పలమనేరు, మహానాడు : జగన్ పాలన దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యమని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మి లారెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ పాలనలో పచ్చిగా మాట్లాడితే హత్య రాజకీయాలే సమాధానమని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్య మేలుతున్నాయని ధ్వజమెత్తాయి. వ్యవసాయాన్ని జగన్ నాశనం చేశాడు. ఇదే జిల్లాలో పట్టు పరిశ్రమను దివాలా తీయించాడు. ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా 30 వేల కుటుంబాలకు మోసం చేశాడు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా, రౌడీ రాజ్యం సాగుతోందన్నారు. ఎక్కువ మాట్లాడితే హత్యా రాజకీయాల రాజ్యం కొనసాగుతుందని విమర్శించారు. జగన్ పాలన గూండాల రాజ్యమని వ్యాఖ్యానించారు. పలమనేరు ఎమ్మెల్యే మొత్తం మాఫియా అంట కదా..నియోజక వర్గంలో కనిపించింది లేదట కదా.. ఓటేసి గెలిపిస్తే నెత్తిమీద టోపీ పెట్టాడట కదా అని విమర్శించారు.
నదిలో మొత్తం ఇసుకే లేకుండా మాయం చేశాడట. మళ్లీ ఓటేస్తే పలమనేరు ప్రజలను అమ్మేస్తాడు. కౌటిల్య నదిలో మొత్తం ఇసుక దోచేశారు. కౌటిల్య ప్రాజెక్ట్ వైఎస్‌ఆర్ కట్టించి ఇచ్చారు. ఇసుక తవ్వేసరికి నీటి కొరత ఏర్పడిరది. సాగునీరు ఎలాగూ లేదు..తాగునీరు మాయం చేశారు. ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే ఇసుక అమ్మేశాడు. మళ్లీ గెలిస్తే భూములను అమ్మేస్తాడని ధ్వజ మెత్తారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, ఇద్దరికీ ఓటేస్తే పడే ఓటు బీజేపీ ఖాతాలోకే వెళుతుందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసింది. హోదా అని మోసం చేసింది. పోలవరం కట్టకుండా మోసం చేసింది. రాజధానికి సహకారం ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. పలమనేరు నియోజకవర్గంలో శివశంకర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.