Mahanaadu-Logo-PNG-Large

విభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం

• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం
• అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం
• కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది
• ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు
• జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం.
– జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ సంక్షోభానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం చేస్తూ ఏమన్నారంటే..

2014న జరిగిన పరిణామాలు ఒక అవగాహనకు వస్తే భవిష్యత్ లో ఏం చేయాలనేది మనందరికి ఒక క్లారిటీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బైఫర్ కేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి.

విభజన సమస్యలు : రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం, రాజధాని తెలంగాణకు వెళ్లడం వల్ల వచ్చిన నష్టాన్ని వివరించారు.

బైఫర్ కేషన్ అన్ సైంటిఫిక్ గా అన్ జస్టిస్ గా అదే మాదిరిగా ఇర్రేషనల్ స్టేట్ బైఫర్ కేషన్ జరిగింది. స్టేక్ హోల్డర్స్ ని ఎవరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోయారు. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు తక్కువున్నాయి. సిటీస్ లేవు. అర్బన్ లేకపోతే ఆదాయం కూడా తగ్గుతుంది. విభజన సమయంలో రాష్ట్రానికి వచ్చిన 46 శాతం ఆదాయంతో 58 శాతం జనాభాను పోషించాల్సి వచ్చింది.

గత ప్రభుత్వం కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది. అప్పుల భారం పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా వైపు పోతుంది. అమరావతి అభివృద్ధి నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుంటోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తనాం వైపు పోతుందని హెచ్చరించారు. పర్ కాపిటా ఇన్ కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 95 వేల 185 రూపాయలు తలసరి ఆదాయం .. విభజన జరిగిన తర్వాత ఒకసారి క్వాంటం జంప్ చూస్తే 93 వేల 903 రూపాయలకు తగ్గింది. తెలంగాణ 1 లక్షా 24 వేల 104 రూపాయలకు పెరిగింది.

రైతులకు అప్పుల భారం పెరిగింది.. వ్యవసాయ రంగం క్షీణించింది

2014లో వ్యవసాయం పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కంపేర్ చేస్తే 33 శాతంతో ముందుంటే తెలంగాణ 19 శాతానికి వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23 శాతం, తెలంగాణ 19 శాతంగా ఉంది.సర్వీస్ సెక్టార్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 44 శాతం, తెలంగాణ 61 శాతంగా ఉంది. 17 శాతం డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టార్ లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీని వల్ల ఒక స్ట్రక్చర్ లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్ హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది.

ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే.. తెలుగు జాతే ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫ్యాక్షన్. నేను ఆరోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకుంది అది ఏ ప్రభుత్వం వచ్చినా.. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి.

హైదరాబాద్ అక్కడకు వెళ్లింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్లీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక రాజధాని కట్టుకునే అవకాశం.. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు.. పోలవరాన్ని పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చుకోవచ్చు.

రాష్ట్రానికి సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందూ వెనకగా ముందుకుపోతుందన్న ఉద్దేశంతో 5 ఏళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం.

2014-19లో జలవనరులపై శ్రద్ధ.. సత్ఫలితాలు

ఎప్పుడూ పెట్టనంత ఇరిగేషన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం ఖర్చు చేశాం. 64 వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు వచ్చాయి.

పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ : పోలవరం పూర్తయ్యే వరకు ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి పట్టిసీమ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్లు తీసుకొచ్చాం. రూ. 1667 కోట్లు పెడితే ఈరోజు దాని వల్ల వచ్చిన ఆదాయం చూస్తే దగ్గర దగ్గర 7, 8, 10 సంవత్సరాలలో చూస్తే రూ.44,000 కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది.

ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి

విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్ని ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్ పోర్టు కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది. కావాలని మళ్లీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం దాని వల్ల అది పూర్తి కావాలంటే మరో రెండు సంవత్సరాలు పడుతుంది.ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్ పోర్ట్ కూడా తీసుకువచ్చాం. అదైతే ఒక సంవత్సరంలో ప్రారంభించాం. ఒక సంవత్సరంలో పూర్తి చేశాం.

రోడ్ల అభివృద్ధి : 4,386 కిలో మీటర్లు రోడ్ నెట్ వర్క్ డెవలప్ చేశాం.

పోర్టుల అభివృద్ధి : అప్పుడున్న పోర్టులు కాకుండా మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం కొత్త పోర్టులను ప్రారంభిస్తే, అవి కూడా పీపీపీ మోడల్ లో వెళితే మళ్లీ వాటి పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకువచ్చి తనకు కావలసిన వాళ్లకు అప్పజెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితికి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ క్రింద ఎక్కడా దేశంలో లేని విధంగా ఒక 8 వేల ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 5 ఏళ్లలో ఒక్క సంవత్సరం మనం రెండో పరిస్థితికి వచ్చాం. 4 సార్లు మనం నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాం.
స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం.

ఇండస్ట్రియల్ కారిడార్స్
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), చెన్నై –బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ) ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ని 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం.

పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్

కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్ కాన్, సెల్ కాన్ ఇలాంటి అనేక కంపెనీలు… ఆరోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.

విద్యుత్ రంగంలో సంక్షోభాలు – సవాళ్లు – మిగులు విద్యుత్ కు బాటలు

2014-15లో 22.5 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంటే 5,6 నెలల్లోనే కరెంట్ కొరత అధిగమించి 2019 కి మిగులు కరెంట్ కూడా ఇచ్చాం. ఇంకో పక్క పర్ కేపిటా కన్జప్షన్ ఆఫ్ కరెంట్ చూస్తే 1003 యూనిట్ల నుంచి 1234 యూనిట్లకు పెంచాం.
పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్లతో ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల ఎంవోయూలు చేశాం. 5 లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ లు స్టార్ట్ చేశాయి. స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1 కోటి 1 లక్ష 10 వేలు చేసి 7 లక్షల 72వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం.

ఏనాడూ సంక్షేమం మరవలేదు

ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. రూ.200 పెన్షన్ ను రూ.1000 కి పెంచి, రూ.1000 నుండి రూ.2000కు పెంచి అంటే 200ను 2000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం, సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం ఈరోజు మళ్లీ రూ.3000 ఉంటే ఒకేసారి రూ.4000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7వేల రూపాయలు పేదవాళ్లకి ఇచ్చాం.

ఇతర అంశాలు

ఫామ్ లోన్ వెయివర్.. రూ.15,279 కోట్లు కష్టాల్లో ఉన్నా ఇచ్చాం. 43 శాతం పిట్ మెంట్ ఇచ్చి ఉద్యోగుల పక్షాన నిలబడ్డాం. 20 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చాం. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ లు తీసుకువచ్చాం. డ్వాక్రా సంఘాల (సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ ) ఆదాయం రూ. 36,000 ఉంటే రూ.84,670 లు తలసరి ఆదాయం ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చాం.

బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, ఆరోగ్యం పరిశుభ్రత, నీరు- చెట్టు, పొలం పిలుస్తోంది.. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చాం. సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా 34 శాతం బడ్జెట్ లో సంక్షేమానికి ఖర్చు పెట్టాం. అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అయి ఉంటే మనకు ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు.

32 లక్షల ఆయకట్టు స్థిరీకరణ – కొత్త ఆయకట్టుకు నాంది

రూ.48,000 కోట్లు ఇరిగేషన్ కు బడ్జెట్ లో ఖర్చు పెట్టాం. రూ. 20,000 కోట్లు నీరు చెట్టు, నరేగాలో ఖర్చు పెట్టాం.32 లక్షల 30వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 45 వేల 288 ట్యాంకులను అభివృద్ధి చేశాం. 11 లక్షల 30వేల ఎకరాల కొత్త ఆయకట్టును తీసుకువచ్చాం.

పట్టిసీమ ద్వారా గోదావరి నుండి కృష్ణమ్మకు నీళ్లు తీసుకొచ్చాం. మొట్టమొదట 2 నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ ఐదేళ్లు ఆగిపోయింది. పట్టిసీమను కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో, నేనెక్కడ గుర్తొస్తానో అని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్లులో చూశాం. కడాన నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు.

పులిచింతలలో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణా నది ఉన్నంత వరకు .. రెండు నదుల సాక్షిగా చెబుతున్నాను ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడిని క్రియేట్ చేసిన మహానాయకుడు గడిచిన ముఖ్యమంత్రి..అదే ఆయన చూపించినటువంటి పరిపాలన

ఆంధ్రుల జీవనాడి పోలవరం

పోలవరానికి 15,364 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో రూ.11,762 కోట్లు 2014-19లో ఖర్చు పెట్టాం. అదే తెలుగు దేశం ప్రభుత్వం కానీ ఆరోజు అధికారంలో ఉండి ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండేది.2027కి వస్తుందా , 2028కి వస్తుందా ? అని ఈరోజు ఇంకో మూడేళ్లు అంటున్నాం.

నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెరికా, కెనడా, వేరే దేశాల్లో ఉండే ఎక్స్ పర్ట్స్ ను పిలిపించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఒపీనియన్ తీసుకున్నారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు .. మళ్లీ పోలవరానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యార్ లల్ గా మళ్లీ న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలని.. ఒరిజినల్ గా డయాఫ్రమ్ వాల్ కట్టింది రూ.446 కోట్లు.

అదే రిపేర్లు మూడు దిక్కున జరిగాయని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ మూడు రిపోర్ట్స్ చేస్తే రూ.447 కోట్లు అవుతుంది. అయితే అది గ్యారంటీ లేదు .. అందుకనే వాళ్లు రెకమండ్ చేసింది గోదావరి ఒకేసారి 55 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వస్తే పీక్ పీరియడ్ లో దీనికి డిజైన్ చేసింది 55 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్.. మనమందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్.

చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు అని. దాని కంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి. అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్లీ చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో రూ. 990 కోట్లతో న్యూ డయాఫ్రమ్ వాల్ కన్ స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రెకమండ్ చేశాం కేబినెట్ లో.

ఒక దుర్మార్గమైన పాలనను చెప్తే.. కూర్చుంటే ఇవన్నీ విని ఉంటే బాగుండేది కానీ వినే ఓపిక లేదు ఉండే ఆ 10 మందికి కూడా. ఒక దుర్మార్గమైన పాలన వల్ల రూ.466 కోట్లతో అయిపోయిన ప్రాజెక్టును ఈరోజు 990 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన చేయడం వల్ల 2021కి అయ్యే ప్రాజెక్టును 2027,2028కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది.

పోలవరం పూర్తి అయి ఉంటే రూ.45,000 కోట్లు ఆదాయం వచ్చేది. డ్యామేజీలు, అదనపు ఖర్చు రూపేణా రరూ. 4,900 కోట్లు అవుతుంది. హైడల్ పవర్ వచ్చి ఉంటే రూ.3000 కోట్లు ఆదాయం వచ్చేది. ఒక్క పోలవరంపై వచ్చిన నష్టం రూ.55,000 కోట్లు.

ఇతర ప్రాజెక్టులు

పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 2,15,000 ఎకరాలు.బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార 2,10,520 ఎకరాలు.హంద్రీనీవా సుజల స్రవంతి 1,93,000 ఎకరాలు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి 1,64,000 ఎకరాలు. శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు. కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు .. ఇవన్నీ కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం.

న్యూఎపిక్ సెంటర్ ఆఫ్ గ్రోత్ -అమరావతి

అమరావతి రాజధాని వరల్డ్ బెస్ట్ సిటీగా తయారయ్యేది. ఈరోజు దేశంలో ఒక ఆస్పిరేషన్ ఉంది కొత్త నగరాలు రావాలని.. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినవి. ఆరోజు హైదరాబాద్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ అని రెండు నగరాలు ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను. ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చారు ఆరోజు ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం.

ఆరోజు కానీ అమరావతి ఇదే స్పీడ్ లో జరిగి ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ .ఇక్కడ అమరావతి దేవతల రాజధాని. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు.

రాజధాని విషయంలో స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు ఒక్క డిస్ఫ్యూట్ లేకుండా పూర్తిగా వాలంటీర్ గా, స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. రూ.41,171 కోట్లకు టెండర్లు పిలిచాం. రూ. 4,318 కోట్ల పనులు అయ్యాయి. రూ. 1268 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి.

అమరావతి పూర్తి అయి ప్రపంచం చర్చించుకునే విధంగా ఉండేది.ఒకప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి వారి చెప్పేవాడిని మీరు హైదరాబాద్ రమ్మని.. వాళ్లు అడిగేవాళ్లు హైదరాబాద్ అంటే మీది పాకిస్థాన్ హైదరాబాదా ? లేక ఇండియా హైదరాబాదా అని.. నేను గర్వంగా చెప్పేవాడిని ఇండియా హైదరాబాద్ అని.

ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు.. పాకిస్థాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది.. ఇండియా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు తెలియజేస్తున్నాను.అమరావతి కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది.50వేల నుండి లక్ష మంది అక్కడ నివాసం ఉన్నారు.

ఇది మనం మరింతగా ముందుకు తీసుకువెళ్లేవాళ్లం. 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రూ.2 లక్షల నుండి 3, 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది.. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది.మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది.. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకువస్తాం

ఎకనమిక్ గ్రోత్ లో టాప్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్

5 సంవత్సరాలలో ఎకనమిక్ గ్రోత్ 13.5 శాతం..టాప్ -3లో మనది ఒకటి. దాదాపుగా నెంబర్ 1 గా చేయగలిగాం.మాన్యుఫ్యాక్చరింగ్ 10 శాతం.. ఆల్ ఇండియా లో చూస్తే 8.4 శాతం. ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయం అనుంబంధం 16 శాతం .. అందులో కూడా ఆక్వా కల్చర్ 29.6 శాతం గ్రోత్ వచ్చింది. 7 లక్షల 72 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ అంటే మన ఆదాయం 13.2 శాతం పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో మనది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ కేపిటా ఇన్ కమ్ గ్రోత్ .. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆరోజు మనం 13.2 శాతంకు పెంచాం. ఆలిండియా లెవల్లో 9.7 శాతం .. అంటే ఆలిండియా కన్నా 3.5 పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం.

ఆరోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పెరా మీటర్స్ లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణలో బెస్ట్ ఎకో సిస్టం ఉంది. ఆటో ఫైరట్ లో ఉంది. వాళ్లు ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్లాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం.అక్కడినుండి గత చరిత్ర 2019 ప్రారంభమైంది. ఫిగర్స్ అన్నీ చూస్తే చాలా అధ్వాన్నమైన పరిస్థితికి వచ్చాం.

డిక్లైన్ ఇన్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు సర్వీస్ సెక్టార్.. వ్యవసాయం లో 2014-19లో 16 శాతం సీఏజీఆర్ పెరిగితే ఇక్కడకు (2019-24) వచ్చేసరికి 10.3 శాతం. అంటే 5.7 శాతం వ్యవసాయం గ్రోత్ ఐదేళ్లలో తగ్గిపోయింది. అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది.

అదే సమయంలో సర్వీస్ సెక్టార్ 11.9 శాతం పెరిగితే 2019-24లో 9.9 శాతం అంటే 2.2 శాతం తగ్గింది.. ఓవరాల్ గా గ్రోత్ రేట్ చూస్తే 13.5 శాతం ఆరోజు పెరిగితే 10.5 శాతం కు వచ్చాం. అంటే 3 శాతం తగ్గాం.

ఓవరాల్ గా మీరు చూసినప్పుడు 6 లక్షల 94 వేల కోట్లు జీఎస్ డీపీ కాంట్రిబ్యూషన్ తగ్గింది. దాని వల్ల మన రాష్ట్రానికి రావాలసిన ఆదాయం చూస్తే రూ.76,195 కోట్ల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది
సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. అదే మాదిరిగా ఇంకో పక్కన చూస్తే కోవిడ్ లెక్కేసుకున్నా రూ.52,197 కోట్లు వచ్చేది.

కొత్తగా మేజర్ ఇండస్ట్రీలు రాలేదు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లు రూ.6600 కోట్లు రిలీజ్ చేయలేదు. వాటిని ఉపయోగించుకోలేకపోయాం. తద్వారా పేదవారికి న్యాయం జరగలేదు.అమరావతి, పోలవరం, రోడ్లకి పెట్టుబడులు చాలా రాగా కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ తగ్గించారు.

యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ 227 ల్యాండ్స్ అలాట్ చేస్తే విత్ డ్రా చేయించారు. వారిని తరిమేశారు. జీఎస్ డీపీ 6.94 లక్షల కోట్లకు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. తద్వారా రూ.76, 195 కోట్ల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది.

ద్రవ్యోల్బణం 2014-19లో 4.5 శాతం తగ్గితే , 2019-24లో 6.2 శాతం పెరిగింది. అంటే 1.7 శాతం అధికంగా ద్రవ్యోల్బనం వచ్చింది.ట్యాక్సులు విపరీతంగా పెంచారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక ఛార్జీలు పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజలను ఇబ్బందికి గురిచేసిన దుస్థితి.

ఆదాయం తగ్గింది.. అప్పు పెరిగింది

9 లక్షల 74 వేల కోట్ల అప్పులు చేశారు. ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉంది.

• తలసరి అప్పు రూ.74,790 నుండి రూ.1,44,336కు పెరిగింది. ఆదాయం 13.2 శాతం నుండి 9.5కి తగ్గింది. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతోంది.స్థానిక నిధులు, ఉద్యోగుల సేవింగ్స్, సీఎస్ఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు

ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ పేరుతో 33 సంస్థలు, సొసైటీలు, కంపెనీల ద్వారా అప్పులు చేసి నిధులు పక్కదారి పట్టించారు.స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో అప్పులు చేశారు. తాకట్టులు పెట్టారు. మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి ఆ ఆదాయాన్ని ప్రోగ్రాంలకు ఇచ్చారు.

భవిష్యత్ ఆదాయం

ఏపీఎస్‌బీసీఎల్ & ఏపీఎస్‌డీసీ పేరు పెట్టి లిక్కర్ సేల్స్. ఒకపక్క సిటిజన్స్, హైకాస్ట్, లో-క్వాలిటీ లిక్కర్. ఇక్కడ వ్యాట్ వేశారు. వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ ను డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో. ఆ డబ్బులు ఇప్పటికి రూ.20,676 కోట్లు డైవర్ట్ చేసి ఏపీఎస్‌బీసీఎల్ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్‌కి ఇచ్చారు.

‘అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్’ వేసి రూ.14,275 కోట్లు ఇప్పటివరకు ఎస్క్రోవ్డ్ ఇచ్చారు. నేరుగా ఎస్క్రో నుంచి గవర్నమెంట్‌కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్లిపోతుంది. మొత్తం కలిసి అక్కడకు వచ్చేటప్పటికి గవర్నమెంట్‌కి రావడం ఇవన్నీ కూడా 15 ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ‘ఏఆర్ఈటీ’ పెట్టారు. అంటే 15 ఏళ్లు కడుతూనే ఉండాలి.

మనం కూడా ఇంక ఈరోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం, కాస్తోకూస్తో ఎక్సైజ్‌లో వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది.సాధారణంగా గవర్నమెంట్ అంటే ఎవడు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే. భారం కూడా ప్రజల కోసం పెట్టిన భారాలే. ఇప్పుడు ఇంక 15 ఏళ్లు ఆ డబ్బులు వెళ్తూనే ఉంటాయి ఈ రూటులో. అందుకే.. తాగండి, తాగించండి.. ఇప్పుడు మొత్తం ఊడ్చేసి వెళ్లిపోయాడు.

మద్యపాన నిషేధం అన్నాడు అయిపోయింది. ఇది మీరందరూ మళ్లీ అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించడం. ఎవరికీ ఈ ఆలోచన వచ్చి ఉండదు ప్రపంచంలో. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరికీ రాలేదు. ఎక్సైజ్‌లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ వేయొచ్చు. వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఈ రెండూ కలెక్ట్ చేసి మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు డైరెక్ట్‌గా పెట్టొచ్చు. లేకపోతే ఆయన లూట్ చేసినదానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్నీ. అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు.

మొన్న కాల్చి వాతలు పెట్టారు విశాఖపట్నం వాసులందరూ. ఈరోజు మీరిక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు, రూ.359 కోట్లకు తాకట్టు పెట్టారు. డైరీ.. 30 ఎకరాలు, రూ.309 కోట్లకు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు రూ.270 కోట్లకు తాకట్టు పెట్టాడు. కడాన.. పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు, రూ.215 కోట్లకు తాకట్టు పెట్టారు. ట్రైనింగ్ & ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిసేబ్‌ల్డ్ వెల్ఫేర్.. పాపం వాళ్లను కూడా అమ్మేశాడు. 19 ఎకరాలు రూ.157 కోట్లకు తాకట్టు పెట్టారు.

ఈ ఈ బంగ్లా 10 ఎకరాలు రూ.203 కోట్లు, ఆర్&బి క్వార్టర్స్ 3 ఎకరాలు రూ.99 కోట్లు, కడాన రైతు బజార్‌ను కూడా వదిలి పెట్టలేదు. 4 ఎకరాలుంటే రూ.90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్.. మనం ఉండే అప్పుడప్పుడు పోయుంటారు దానిని కూడా 3 ఎకరాలు రూ.81 కోట్లకు పెట్టాడు. పీడబ్ల్యూడీ ఆఫీస్ 4 ఎకరాలు రూ.79 కోట్లు, కడాన సెరికల్చర్ 6 ఎకరాలు రూ.47 కోట్లు, తహసీల్దార్ ఆఫీస్, సీతమ్మధార ఒక ఎకరా రూ.34 కోట్లు.. ఇంక మిగిలినవన్నీ వీళ్లు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు. రూ.1,941 కోట్లు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు, ఒక రూ.40వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండూ.. అదే కేపిటల్, అందమైన పేరు.

ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను. గవర్నమెంట్‌కు వచ్చిన డబ్బులను రూ.1,453 కోట్లు ట్రాన్స్ ఫర్ చేయలేదు వాళ్లకి ఇవ్వలేదు. ఇంకొకపక్క.. పీడీ అకౌంట్స్ లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని రూ.1,689 కోట్లు. ఈ రెండూ కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు రూ.3,142 కోట్లు.

డిస్కమ్స్.. మొత్తం రూ.2,166 కోట్లు డైవర్ట్ చేశారు. ఇది కాకుండా ఎంప్లాయీ సేవింగ్స్ డైవర్ట్ చేశారు రూ.5,243 కోట్లు. పెన్షన్ & ప్రావిండెంట్ ఫండ్, ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్ కో, డిస్కమ్స్ ఇవన్నీ రూ.3,143 కోట్లు.
ఏపీఎస్‌బీసీఎల్ లో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ప్రతి ఒక సంవత్సరానికి రూ.25.40 కోట్లు నష్టం వస్తుంది. పదేళ్లు డైవర్ట్ చేశారు, పదేళ్లు బాండ్స్ ఇచ్చారు. 10×25 వేసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రూ.250 కోట్లు. వాళ్లు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రూ.250 కోట్లు వారికి లాభం వచ్చేది. అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్ తో రూ.250 కోట్లు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు.

అభయహస్తం

రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డ్వాక్రా మహిళలు. ఆ డబ్బులు రూ.2,100 కోట్లు ఉంది. దాంట్లోంచి రూ.500 నెలకు వారికి పెన్షన్ వస్తుంది. అది కూడా తీసుకుని కొట్టేశాడు. అది కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేశారు.
ఖర్చులు ఆదాయం కంటే కూడా పెరిగాయి. అందుకనే 2019-20లో 27 శాతం లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి. 2020-21లో 43 శాతం, 2021-22లో 31 శాతం, 2022-23లో 37 శాతం, 2023-24లో 30 శాతం.. డిఫరెన్స్ ఉంది తగ్గలేదు అక్కడికి వచ్చేసరికి ఖర్చు పెట్టారంతే ఇంక ఖర్చు పెట్టలేక వదిలేశారు ఇంక అప్పులు దొరక్క.

అప్పుల భారం

మన స్టేట్ కు ఎంతయిందో ఒకసారి మనం చూస్తే.. ఇది ఈరోజు అప్పు. 31.03.2019 కి రూ.3,75,295 కోట్లు.. 12.06-2024 కి రూ.9,74,556 కోట్లు. ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్లన్నీ కలిపి అందుకే అక్కడ చూపించాం.

గవర్నమెంట్ debt రూ.4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ debt రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.36,000 కోట్లు, పవర్ సెక్టార్ రూ.34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ చూస్తే రూ.1,13,244 కోట్లు కాంట్రాక్టులు కూడా, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ రూ. 21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ రూ.1,196 కోట్లు. మొత్తం కనుక మనం చూస్తే ఒక లక్షా 13 వేల కోట్లు, 22 వేల కోట్లు.. ఈ రెండు అప్పులకు యాస్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్లను ఏం చేయాలో అర్థం కాదు, మరలా డెవలప్‌మెంట్ చేయాలి ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు.

ప్రతి డిపార్ట్ మెంట్.. రూ.1,35,224 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్ లో బిల్స్ రూ.19,549 కోట్లు పెండింగ్ ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.19,324 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ రూ.14,613 కోట్లు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ రూ.11,859 కోట్లు, హౌసింగ్ రూ.7,802 కోట్లు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ రూ.7,729 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ రూ.7,610 కోట్లు, హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ రూ.6,486 కోట్లు, ఫుడ్ & సివిల్ సప్లైస్ రూ.5,677 కోట్లు, సోషల్ వెల్ఫేర్ రూ.5,443 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ రూ.5,435 కోట్లు, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.5,191 కోట్లు, బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రూ.2,965 కోట్లు, ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ & బిల్డింగ్స్ రూ.2,574 కోట్లు, అగ్రికల్చర్, మార్కెటింగ్ & కార్పొరేషన్ రూ.2,384 కోట్లు, రెవెన్యూ రూ.1,263 కోట్లు, ఇతరమైనవి రూ.9,318 కోట్లు.. రూ.1,35,224 కోట్లు అప్పులు ఉన్నాయి.

అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి. కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేస్తే తప్ప.. అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీస్‌కు వచ్చిన అప్పులు. ఇంకా అప్పులవాళ్లు వచ్చి చెప్తే లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు.

ఇది కాకుండా కోర్టులో దగ్గరదగ్గర ఒకసారి మీరు చూస్తే.. కంటెప్ట్ కేసులు ప్రతిరోజు 5,615 కేసులు వేశారు రూ.1,761 కోట్లకు. రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,269 కేసులకు ఇచ్చారు రూ.1,781 కోట్లకు. రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,104. మొత్తం 24,988 రిట్స్ ఫైల్ చేశారు రూ.3,542 కోట్ల కోసం. లీగల్ ఉంటే అదొక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్. లాయర్ల కంటే ఐఏఎస్ ఆఫీసర్‌ని, సీఎస్‌ని లేకపోతే సీనియర్ ఆఫీసర్ ను పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి.. నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి.

పనిష్‌మెంట్, జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏవిధంగా నిర్వీర్యమైపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏవిధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి.
వీళ్లు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వొద్దని, ఇవ్వలేవని.. వీళ్లు ఇవ్వలేకపోయారు. వాళ్లు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ కూడా ఫుల్ ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు.. ఎవరైతే కన్‌సార్డ్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్‌ని కంటెప్ట్ కింద జైలుకు పంపిస్తున్నారు, పనిష్‌మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం అదీ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. ఒకట్రెండు తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం. ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారు ?
ఎప్పుడు కూడా కేపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలివ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ కేపిటల్ ఎక్స్‌పెండిచర్ మీరు చూస్తే దగ్గరదగ్గర ఐదేళ్లల్లో 2014-19 కంటే 60 పర్సెంట్ తగ్గిపోయింది. 40 శాతమే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు.

40 శాతం ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఒక్కోసారి గ్రోత్.. ఒక్క పర్సెంట్ గ్రోత్ వస్తే రూ.15 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. 5 శాతం పెంచుకోగలిగితే రూ.75 వేల కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం రూ.15 వేల కోట్లు అప్పుకానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం. మనం సంపాదించుకోలేక ఇదొక ఎగ్జాంపుల్ ఇది.

అందుకే ఈరోజు మీరు చూస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిస్ అడ్వాంటేజెస్ ఉన్నా 2018-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకుపోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్ కు వెళ్లిపోయాం.
ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఈరోజు మీరిక్కడ చూస్తే ఒక్క వాటర్ రిసోర్స్ లో 2014-19లో రూ.47,838 కోట్లు పెడితే వీళ్లు రూ.20వేల కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2014-19లో రూ.8,868 కోట్లు పెడితే వీళ్లు పెట్టింది రూ.1,357 కోట్లు.

అందుకే ఏ రోడ్ చూసినా గుంతలు. రోడ్ మీద ఎక్కడా మట్టి అనేది వేయలేదు ఈ ఐదేళ్లలో. అందువల్లనే మొత్తం నాశనమైపోయాయి వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్ లో 2014-19లో రూ.1,045 కోట్లు పెడితే వాళ్లు రూ.405 కోట్లే పెట్టారు. విమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబ్‌ల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం రూ.357 కోట్లు పెడితే వాళ్లు రూ.186 కోట్లు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కి 2014-19లో రూ.289 కోట్లు పెడితే వాళ్లు ఒక్క పైసా పెట్టలేదు.

ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కు 2014-19లో రూ.1.142 కోట్లు పెడితే 2019-24లో 965 కోట్లు పెట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ 2014-19లో రూ.609 కోట్లు అయితే 2019-24లో రూ.229 కోట్లు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కు 2014-19లో రూ.732 కోట్లు పెడితే వాళ్లు పెట్టింది రూ.372 కోట్లు.

అంటే కేపిటల్ ఇన్‌ఫ్రా ఇది వచ్చినప్పుడు ఆ ఎక్స్ లో క్లాసిఫికేషన్స్ ప్రకారం పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయ్యుంటాయ్ అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్‌గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది.
వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో 2014-19కి 2019-24కి 57 పర్సెంట్ తగ్గిపోయింది. అంటే రూ.47,838 కోట్లు నుంచి రూ.20,752 కోట్లకు పడిపోయింది.

ఒక్క ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో 2014-19 కి 2019-24కి 85 శాతం తగ్గిపోయింది. అంటే రూ.8,868 కోట్లు నుంచి రూ.1,357 కోట్లకు పడిపోయింది. అందుకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బతింటుందో ఆటోమేటిక్‌గా అభివృద్ధికి కూడా సెడ్ బ్యాక్ వస్తుంది అదే ఈ రాష్ట్రంలో జరిగింది.

2014-19లో 59.15 శాతం మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనాసరే రూ.1,35,106 కోట్లు అప్పు తెస్తే రూ.79,913 కోట్లు మనం ఓన్లీ కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ పెట్టాం. వీళ్లు అప్పు చేసుకొచ్చింది రూ.3,06,606 కోట్లు రికార్డులో చూపించారు కేపిటల్‌కు పెట్టింది రూ.69,117 కోట్లు అంటే 22.54 శాతంకు తగ్గిపోయింది.

ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు రూ.100 మనం బారోవ్డ్ చేస్తే రూ.59.15 ఖర్చు పెట్టాం. వాళ్లు రూ.100 బారోవ్డ్ చేస్తే రూ.22.54 మాత్రమే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇదొక విషియస్ సర్కిల్‌గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది.

ఏవిధంగా ఒక debt trap, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్‌లో పడ్డామో ఇదొక ఉదాహరణ. హై డెబ్ట్ సర్వీసింగ్.. 9 లక్షల 74 వేలకు రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడూ కూడా బ్యాంకులన్నీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్రెడిబులిటీ ఉంటే రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగినప్పుడు అలాగే ఉంటారు. తిరిగి ఇస్తారన్న నమ్మకం ఉంటే వడ్డీ తక్కువతో ఇస్తారు ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవని అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటూ పోతారు. అదే ఇక్కడ జరిగింది.

ఒక్కోచోట 2 శాతం, 3 శాతం, 4 శాతం హైఇంట్రెస్ట్ రేట్స్ వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొకపక్కన డిక్రీజ్ ఇన్ కేపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయ్. దీనివల్ల ప్రొడక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది.

మళ్లీ హయ్యర్ ట్యాక్స్ కు వెళ్లారు, మోర్ బారోయింగ్స్ కు వెళ్లారు. దీనివల్ల మళ్లీ ఈ సైకిల్ ఇంకా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్లీ ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన.. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో మనం 30 శాతం పెడితే గవర్నమెంట్ 70 శాతం ఇస్తుంది. మనం 40 శాతం పెడితే వాళ్లు 60 శాతం పెడతారు.

మనం 40 పర్సెంట్ ఇవ్వలేక 30 పర్సెంట్ ఇవ్వలేక 10 పర్సెంట్ ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు అదొక హౌసింగ్ తీసుకోవచ్చు. ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు ఏదైనాసరే అన్నింట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది.

ఎకనామిక్ ఇండికేటర్

2014-19లో వాటర్ టారిఫ్ రూ.40 ఉంటే 2019-24లో అది రూ.120. ఇసుక అప్పుడు ఫ్రీ ఉంటే వాళ్లు టన్ను రూ.475. జీఎస్‌డీపీ రేషియో 2014-19లో 44 శాతంగా ఉంటే 2019-24లో 53 శాతం.
గత ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల ఎక్కువ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మనకు వచ్చే రూ.72వేల కోట్ల ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ పైన జీతాలు, పెన్షన్లు అన్నింటికీ ఖర్చు పెట్టాలి. ప్రతి నెలా గ్యాప్ రూ.19,107 కోట్లు.

పోలవరం ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటివరకు రూ.53 వేల కోట్లు నష్టం. అమరావతి విధ్వంసం వల్ల 7 లక్షల ఉద్యోగాలు పోయాయి, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి తరిగిపోయింది..
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకాయనకు ఆస్తుల విలువ రూ.100 కోట్లు పెరిగింది.. ఆయన రూ.1 కోటి అన్న క్యాంటీన్లకు ఇచ్చాడు.గత ఐదేళ్లలో రూ.32 వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.. కడాన ఒక లక్షా 29 వేల కోట్లతో పవర్ సెక్టార్ అప్పుల ఊబిలో ఉండే పరిస్థితి..

ప్రజా వేదికను కూల్చేశారు.. ఒక వ్యక్తి విలాసం, పైశాచికం కోసం రూ.500 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ కట్టారు.. 36 మందిని చంపేశారని చెప్పారు.. ఆ 36 మంది పేర్లు ఇవ్వమని చెప్పాం.. సిగ్గుంటే ఇవ్వాలి.
ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా, ఆ పేపర్‌లో నేను రాసుకుంటా, నేను నమ్మిస్తా అంటున్నారు. బాధ, ఆవేదన ఉంది. మనం సూపర్ సిక్స్ చెప్పాం. చూస్తుంటే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం.నాయకుడు ప్రజల్లో ఉండాలి, బాధ్యతగా ఉండాలి..మనం ట్రస్టీస్ మాత్రమే పెత్తందార్లు కాదు.

గత ఐదేళ్లలో లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఒక పేరా పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణానికి ముందుకొస్తామని చెప్పింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లను రూ.4వేలకు పెంచాం, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం, స్కిల్ సెన్సస్ పెట్టాం ప్రపంచంలోనే ఎక్కడా చేయనివిధంగా చేస్తున్నాం, ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది.

ఆగష్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం.. 100 సెంటర్లలో రూ.5 లకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకు శ్రీకారం. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం.మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.సూపర్ సిక్స్ లో అమలు చేయాల్సిన హామీలు కొన్ని ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలి. మనం కూడా కష్టపడాలి.

మన దగ్గర డబ్బుల్లేవు కానీ, ఆలోచనలు, అనుభవాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నగరాన్ని పైసా ఖర్చు లేకుండా బ్రహ్మాండమైన నగరంగా చేశాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ కు పట్టుదల ఉంది.అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ – 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేశాం. క్రియేటివ్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి. సంపద సృష్టించే మార్గాలు కావాలి. దేశంలో 16 లేన్లతో రహదారులు వస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయాలి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లలేం.. జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి.. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి.