నామినేషన్‌కు పోటెత్తిన ప్రజలు
వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు
దర్శి భవిష్యత్తు కోసం పనిచేస్తానని వెల్లడి
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమం వేలాదిమంది కార్యకర్తలు, కూటమి శ్రేణులు, ప్రజల మధ్య ఘనంగా జరిగింది. ముందుగా రాజంపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో గొట్టిపాటి లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేసి కురిచేడు రోడ్డులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం వద్దకు అశేష ప్రజానీకం మధ్య చేరుకుని నామినేషన్ వేశారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో దర్శి పట్టణం పసుపుమయమైంది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆమె వెంట ఉన్నారు.
నాయకులకు కృతజ్ఞతలు: లక్ష్మి
నామినేషన్‌కు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి తిరునగరి జ్యోత్స్న, కాపు సంఘం రాష్ట్ర నాయకులు వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలా జీ, బాబాయ్ గొట్టిపాటి రవి, గోరంట్ల రవికుమార్, నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, షేక్ రియాజ్, పమిడి రమేష్, బొటుకు రమేష్, వరికూటి నాగరాజు, మాడపాకుల శ్రీనివాసరావు, తిండి నారాయణరెడ్డి, ఇతర నేతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు. దర్శిలోనే ఉంటా..ఆసుపత్రి పెట్టి సేవలందిస్తా…అవినీతి లేని పాలన అందిస్తా అని భరోసా ఇచ్చారు. దొనకొండ పారిశ్రామికవాడ అభివృద్ధి, నెదర్లాండ్ స్కీము అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడిరచారు. ఫ్లోరిన్ రహిత దర్శిగా మారుస్తానని, పంటలు పండే విధంగా ఆయకట్టు చివరి భూములకు నీరందేలా చూస్తానని తెలిపారు. కాగా నామినేషన్ జన జాతరను తలపించింది. డప్పుల కోలాటాలు, కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, యువకుల కేరింతల మధ్య ఉత్సాహంగా సాగింది.