వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా తిరణాలలో భారీ విద్యుత్ లైటింగ్ ప్రభను ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, దర్శి సమన్వయకర్త గరికపాటి వెంకట్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు యడ్ల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు, సతీష్ బాబు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.