Mahanaadu-Logo-PNG-Large

జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజు

జవహర్ రెడ్డి బినామీలు భూములు అమ్ముతున్నారు
– జవహర్‌ మరో బినామీ పెరిచర్ల శ్రీనివాసరాజు ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు
– తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు
– మంత్రి నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు
– అప్పన్న స్వామి మీద ప్రమాణం చేద్దాం
– విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలి
– నేను చెప్పింది నిజమేనని నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తా
– సీఎస్‌ జవహర్ రెడ్డికి జనసేన నేత మూర్తియాదవ్ సవాల్

విశాఖ : ‘ సీఎస్‌ జవహర్ రెడ్డి పై నేను ఇదివరకు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. తర్లువాడలో భూములను జవహర్ రెడ్డి తన బినామీ పేరుతో కొట్టేశారు. మంత్రి మేరుగు నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈసీ కాపీ రాకుండా రెవిన్యూ వెబ్‌సైట్ బ్లాక్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు. జవహర్‌కి మరో బినామీ విశాఖలో పెరిచర్ల శ్రీనివాసరాజు. ఆయన ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు. జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు విశాఖలో పలచోట్ల లే అవుట్ వేసి అమ్ముతున్నారు. వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలి’’ అని జనసేన నేత మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. గురువారం విశాఖలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘సీఎస్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఈ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గాని విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి డబ్బులతోనే ఈ బినామీలు ఆస్తులను కొనుగోలు చేశారు.జవహర్ రెడ్డిపై నేను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. సీఎస్‌ జవహర్ రెడ్డికు దమ్మంటే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర తనకు విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలి. నేను చెప్పింది నిజమేనని. నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తాను’’ అని సీఎస్ జవహర్ రెడ్డి‌కు జనసేన నేత మూర్తియాదవ్ సవాల్ విసిరారు.