– సజ్జలపై ఇంతెత్తున లేచిన జెసి ప్రభాకర్‌రెడ్డి
– జెసి వీడియో వైరల్
అనంతపురం: “సజ్జల… నా కొడకా నన్ను జైలు లో పెట్టి అన్నం కూడా పెట్టనివ్వకుండా చేసావ్” …అంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకరరెడ్డి గత వైసిపి సర్కారు లో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల.రామకృష్ణా రెడ్డి పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియా ముఖంగా సజ్జలకు, ఆయనకు సహకరించిన అధికారులు, పోలీస్ డిపార్ట్ మెంట్ ఎస్పీ లపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు, అన్నీ గుర్తున్నాయి… అంటూ హెచ్చరించారు. జెసి సజ్జలను బండబూతులు తిడుతూ జేసీ మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతోంది.