గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను జీవన్ రెడ్డి చదువుకోవాలి

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు
ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ఆరు స్కాం లు చేశారుజీవన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు
గ్రూప్ వన్ నిర్వహణ పై అవగాహన లేనిది జీవన్ రెడ్డి కే
గ్యారంటీలు అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మా నేత హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. గ్రూప్ వన్ నిర్వహణ పై అవగాహన లేనిది జీవన్ రెడ్డి కే హరీష్ రావు కు కాదు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నపుడే వైఎస్ సీఎంగా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు 1 :100 పిలిచారు. అది సాధ్యం కాదు అని జీవన్ రెడ్డి మాట్లాడితే ఎట్లా?

భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలకు 1:100 పిలవాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షం లో ఉన్నపుడు ఒక మాట అధికారం లో ఉన్నపుడు ఒక మాట అనేది కాంగ్రెస్ వాళ్లకు అలవాటు గా మారిపోయింది. ఏపీ లో కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను మార్చి నిరుద్యోగుల డిమాండ్లకు దక్కట్టు వ్యవహరించారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళకే తెలియక పొతే ఎలా? హరీష్ రావు ను ఏదైనా విమర్శించే ముందు జీవన్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. న్యాయవాది ఆయిన జీవన్ రెడ్డి న్యాయమైన మాటలు మాట్లాడాలి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రులకు అన్యాయం చేసేలా మాట్లాడితే ఎట్లా? నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు మాట్లాడితే ఉద్యోగాల భర్తీ ఆయనకు ఇష్టం లేదు అని మాట్లాడితే ఎట్లా జీవన్ రెడ్డి? గ్రూప్ వన్ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే మార్చడానికి లేదని జీవన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఒకసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను జీవన్ రెడ్డి చదువుకోవాలి.

ఏ దశలోనైనా నోటిఫికేషన్ మార్చే అధికారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉందని జీవన్ రెడ్డి తెలుసుకోవాలి. కాంగ్రెస్ నేతలు హరీష్ రావు పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు.

హరీష్ రావు పని తత్వాన్ని కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలి ..కారు కూతలు కూయొద్దు. హరీష్ రావు ఎవరినీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఎదురు దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ఆరు స్కాం లు చేశారు. గ్యారంటీలు అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం.