అర్ధనగ్న ఫొటో నాది కాదు
ఆ ఫొటోను ఫోరెన్సిక్ పంపుకోవచ్చు
‘జెత్వానీ’ కేసు తొలిసారి స్పందించిన కుక్కల విద్యాసాగర్
అమరావతి: ముంబై నటి జెత్వానీ చేస్తున్న ఆరోపణలను కుక్కల విద్యా సాగర్ ఖండించారు. ఈ వ్యవహారంపై ఆయన తొలిసారి ఓ మీడియాతో మాట్లాడారు. ‘నేను ముంబైలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమైంది. అప్పట్లో ఫొటోలు దిగాను. 2014 నుంచి జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆమె చూపిస్తున్న అర్ధనగ్న ఫొటో నాది కాదు. మార్ఫింగ్ చేసి బెదిరించడం ఆమెకు అలవాటు. ఆ ఫొటోను ఫోరెన్సిక్ పంపుకోవచ్చు’ అని తెలిపారు.