Mahanaadu-Logo-PNG-Large

మాజీ స్పీకర్ కు ఝలక్‌!

– మరికొద్ది రోజుల్లో తేలనున్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం

అమరావతి, మహానాడు: మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం బండారం బయటపడనుంది. సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కి గురువారం ఎమ్మెల్యే కూన రవికుమార్‌, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్‌ పల్లి సురేష్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాలివి. సీతారాం… హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల మహాత్మా గాంధీ లా కాలేజీలో మూడేళ్ళ కోర్సుకు ఫోర్జ్డ్ అండ్‌ ఫ్యాబ్రికేటెడ్(నకిలీ) డిగ్రీ సర్టిఫికేట్‌ తో అడ్మిషన్‌ పొందారు.

ఈ వ్యవహారంపై 2022వ సంవత్సరం నుండి పోరాటం చేసినా ఫలితం లేకపోయందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి స్పీకర్‌ తమ్మినేని సీతారాం పైన, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై చీఫ్ జస్టిస్ కి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి, రాష్ట్రపతి కి అన్ని వివరాలతో ఫిర్యాదు చేశారు. అయితే, ఒక్క రాష్ట్రపతి కార్యాలయం నుండి విచారణ చేయమని మాత్రమే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కి లెటర్ వచ్చింది. అయినా సరే గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి చీఫ్ సెక్రటరీ ఎటువంటి విచారణ

రాష్ట్రపతి కార్యాలయం నుండి గురువారం మళ్ళీ వచ్చిన లేఖను జతపరుస్తూ తమ్మినేని సీతారాం పొందిన నకిలీ డిగ్రీ (ఫేక్, ఫోర్జ్డ్ అండ్‌ ఫ్యాబ్రికేటెడ్) సర్టిఫికేట్‌ను పొందుపరిచి ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కడ కూడా పరీక్ష రాయలేదని, అటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ను ఎక్కడా ఇవ్వలేదని ఇది ఫ్యాబ్రికేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ అని చాలా స్పష్టంగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వారు ఇచ్చిన లేఖలు ఆ ఫిర్యాదులో పొందుపరిచారు.

ఈ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ను పెట్టి మహాత్మా గాంధీ లా కాలేజీలో మూడేళ్ళ డిగ్రీ అడ్మిషన్ పొంది ఉన్నారని ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ వారు ఇచ్చిన అన్ని లేఖలను జతపరిచి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ఆ ఫిర్యాదులో కోరారు.