Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్

హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేశారు. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్ జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. కాగా తనను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి జితేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమేరకు ఆయన సీఎం రేవంత్‌ ను కలిశారు.