టైమ్ దగ్గర పడిరది..అడ్రస్ గల్లంతే
పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్
పెనమలూరు, మహానాడు : జోగి రమేష్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ మండిపడ్డారు. విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబసభ్యులకు పెనమలూ రులో ఓటుహక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులను బదిలీ చేయించు కుని, రౌడీ షీటర్లను దింపి హడావిడి చేశారని ధ్వజమెత్తారు. పెనమలూరు స్టేషన్‌లో సీఐ, సిబ్బంది అందరూ విఫలమయ్యారు. జోగి రమేష్ వలస పక్షి, ఎన్నికల ఫలితాలు తరువాత అడ్రస్ ఉండడని వ్యాఖ్యానించారు. స్వాధీనం చేసుకోవడానికి పోరంకి రాజుల రాజ్యమా? నా వెంట్రుక కూడా పీకలేవు.. టైమ్ దగ్గర పడిరదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, కంకిపాడు మండల అధ్యక్షుడు సూదిమల్ల రవీంద్ర, కానూరు మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి అంగీరేకుల మురళి, నాయకులు మాదు రామకృష్ణ, చలసాని రాము పాల్గొన్నారు