మల్లూరు పంచాయతీలో వైసీపీ ఖాళీ
కాకాణిపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత
నెల్లూరు, మహానాడు : నెల్లూరు వేదాయపాళెంలోని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి కార్యాలయంలో ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామపంచాయతీకి చెందిన 150 వైసీపీ కుటుంబాలు ఆయన సమక్షంలో చేరారు. మల్లూరు గ్రామపంచాయతీ మాజీ ఎంపీటీసీ వేల్పుల మణికృష్ణ, ఉలవపాటి నవీన్, సాదం నాగేశ్వరరావు, పెళ్లూరు అనిల్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు, మల్లూరు దళితవాడ నుంచి 60 కుటుంబాలు, కుమ్మరిమిట్ట నుంచి 30 కుటుంబాలు చేరాయి. దీంతో మల్లూరు ఖాళీ అయింది.