గోకవరం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

తూర్పుగోదావరి జిల్లా, మహానాడు: గోకవరం మండలం బొమ్మలదొడ్డి గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు, వైసీపీ సచివాలయ కన్వీనర్‌ డాక్టర్‌ పెంటిమోను చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం పెద్దఎత్తున టీడీపీలో చేరారు. పంచాయతీ 9వ వార్డు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం రాజకీయ చైతన్య సంస్థ కన్వీనర్‌ గంటి వెంకటేష్‌, 6వ వార్డు సభ్యులు సూరంపూడి అయ్యన్న, మాజీ వార్డ్‌ సభ్యురాలు పెంటిమోను దుర్గాదేవి, కాపు సం ఘం అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, మద్దాల బాపిరాజు, శ్రీరామ శెట్టిబలిజి సంఘం సభ్యులు 200 మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.