మాజీమంత్రి కన్నా సమక్షంలో టిడిపిలో చేరికలు

సత్తెనపల్లి 29వ వార్డుకు చెందిన షేక్ బాజీ ఆధ్వర్యంలో వైసిపికి చెందిన 50 మైనారిటీ కుటుంబాలు ఆదివారం మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి కన్నా పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకు సముచితమైన స్థానం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కన్నాను మైనారిటీ నేతలు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బ్రాహ్మణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కన్నా హాజరయ్యారు.

మాదల గ్రామంలో…

సత్తెనపల్లి నియోజకవర్గం మాదల గ్రామంలో వైసిపికి చెంధిన 25 కుటుంబాలు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామ సీనియర్ నేత రావిపాటి మధుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు తెల్లజర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కన్నా పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.