సర్వేపల్లి, మహానాడు: వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన 24 కుటుంబాల వారు బుధవారం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. యనమల రాజేంద్ర ఆధ్వ ర్యంలో చేరిన వారిలో వెంకటేశ్వర్లు, తొమ్మిదో వార్డు సభ్యుడు రాఘవేంద్ర, మస్తాన్ రావు, మురళి, అనిల్, శ్రీహరి, వెంకటరమణయ్య, అంకయ్య ఉన్నారు. నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో సోమిరెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.