అమరావతి, మహానాడు : ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సమక్షంలో పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి టెంపుల్ మాజీ చైర్మన్, పోతుగుంట గురువయ్య నాయుడు తనయుడు, డాక్టర్. పోతుగుంట రాజేష్ నాయుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణలకు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్ నాయుడు కి శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అందించిన సుపరిపాలన, ఆయన కూతురు షర్మిలారెడ్డి కావడంతో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఆకట్టుకుని పార్టీలో చేరుతున్నట్లు వారిరువురు వేర్వేరుగా అభిప్రాయం వ్యక్తం చేశారు.